తెలంగాణలో ఇంటింటికి తెలుగుదేశం



Want create site? Find Free WordPress Themes and plugins.
ఆంధ్రప్రదేశ్ లో ఇంటింటికి తెలుగుదేశం సజావుగా సాగుతోంది. ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఒక సంబరంలా ఈ కార్యక్రమం చేస్తున్నారు టీడీపీ నేతలు. కానీ తెలంగాణలోను ఇంటింటికి కార్యక్రమం చేసేందుకు నేతలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో సమావేశయ్యారు. నేతల మధ్య విభేదాలు ఉన్నా.. వాటిని పక్కన పెట్టి మరీ వారు మాట్లాడుకున్న తీరు ముచ్చటేస్తోంది. పొత్తుల గురించి మాటలతూటాలు పేల్చుకున్న రేవంత్ రెడ్డి, మోత్కుపల్లిలు ఈ సమావేశంలో అదే పంథాను అనుసరించారు. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే 25 నుంచి 30 సీట్లు సాధిస్తుందని మెజార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. అందుకే పొత్తులతో వెళ్లకుండా వెళదామనే ప్రతిపాదన తెచ్చారు. ఇందుకు కొందరు సానుకూలంగా స్పందించగా.. మరికొందరు కాదన్నారు. 
                     గొర్రెలు, బర్రెలు, చేపలు, చీరలతోనే కేసీఆర్ ప్రభుత్వం పాలన పూర్తి చేస్తుందని రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో ధ్వజమెత్తారు. ఉద్యమం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ను ఓడించాలంటే ఉమ్మడిగా పోరాటం చేయాలని కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాలను పాటిస్తూ అంత ప్రజల్లోకి వెళ్లే పని చేయాలన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం విజయవంతం చేసేందుకు అంతా నిర్ణయం తీసుకున్నారు.  
                       పొత్తుల సంగతి తేల్చాలని.. ఏ పార్టీతోను వద్దనే వాదన వచ్చినా.. అది చంద్రబాబు పరిధిలోని అంశమని తేల్చారు మిగతా వాళ్లు. బీజేపీతో మరోసారి కలిసిపోయేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. కేసీఆర్ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను తప్పు పట్టడం, టీడీపీ సంగతిని ప్రస్తావనకు తీసుకురావడం అజెండాలయ్యాయి.   
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*