గాలి, శశికళలు పాదయాత్ర చేస్తారట



Want create site? Find Free WordPress Themes and plugins.
వైకాపా అధినేత జగన్మోహనరెడ్డి నవంబర్ 2 నుంచి పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో విచారణను ఎదుర్కుంటున్న జగన్  పాదయాత్ర పై టీడీపీ నేతలు వ్యంగ్యంగా స్పందించారు. జైలుకు వెళ్లి వచ్చిన జగన్ పాదయాత్ర చేస్తే.. రేపు గాలి జనార్దన్ రెడ్డి, శశికళలు యాత్రలు చేస్తారని ఎద్దేవా చేశారు టీడీపీ నేత కంభంపాటి రామ్మోహనరావు. తప్పు చేసిన వారంతా యాత్ర చేస్తే ప్రజలు ఆదరిస్తారా లేదా చూడాలన్నారు. మరోవైపు జగన్ పాదయాత్ర చేయవద్దని టీడీపీ నేతలు కోరుతున్నారు.. వారు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు మరోవైపు అంబటి రాంబాబు. 
                   వైసీపా ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పారు. మడమ తిప్పం అని అన్నారు. కానీ ఆపని చేయలేదని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తుంటే… నంద్యాలలో డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టే గెలిచారు. కాకినాడ గెలుపును పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు వైకాపా నేతలు. పాదయాత్ర ప్రారంభం కాకముందే ఇలా ఉంటే.. ఇక అది మొదలయ్యాక మరింతగా మాటల తూటాలు పేలే అవకాశముంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*