అమరావతి రాజధానికి సమీపంలోనే భూ ప్రకంపనలు



Want create site? Find Free WordPress Themes and plugins.
ఆంధ్రుల నగరి అమరావతి భూకంప కేంద్ర జోన్ గా ఉందట. ఈ విషయాన్ని భూభౌతిక శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు. భూకంపాలకు సంబంధించి హైదరాబాద్ నగరం జోన్-2లో ఉండగా… అమరావతి జోన్-3లో ఉంది. అంటే భూకంపాలు ఓ మోస్తారుగా వచ్చే వీలుంది. హైదరాబాద్ కంటే అమరావతికి భూకంపాలు వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే అమరావతి రాజధాని నిర్మాణం సమయంలోనే భూకంపాన్ని తట్టుకునేలా నిర్మాణాలు ఉండాలని కోరుతున్నారు వాళ్లు. 
                ఈ మధ్య కాలంలో గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల పరిధిలో భూ ప్రకంపనలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో ఆ పరిస్థితి ఎక్కువగా ఉంది. సంతమాగులూరు ప్రాంతం నుంచి పల్నాడు వైపుకు ఈ కేంద్రం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఒంగోలు, అద్దంకి, కొరిశపాడు తదితర ప్రాంతాల్లో భూమి కంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడి లేచి, బయటికి పరుగులు తీసిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లాలోని చిలకలూరి పేట మండలం మద్ధిరాల, రాజాపేట, ఎడవల్లి, మురికిపూడి గ్రామాల్లో భూప్రకంపనలు కనిపించాయి. కాగా గత మూడు నెలలుగా  తరచుగా ఇక్కడ భూ ప్రకంపనలు సాగుతున్నాయి. గన్నవరంలోను తాజాగా భూప్రకంపనలు రావడంతో దీనిపై పెద్ద చర్చ సాగుతోంది. అమరావతికి గన్నవరం సమీపంలోనే ఉంది.
                 అందుకే బహుళ అంతస్థుల భవనాలు నిర్మాణంలో ఏమైనా ఇబ్బంది ఉంటుందా అనే చర్చ సాగుతోంది. భూకంపాన్ని తట్టుకునేలా భవనాల నిర్మాణం చేయాలంటే ఐదు శాతం వ్యయం పెరుగుతోంది. అయినా ఆ పని చేయడం మంచిదని శాస్త్రవేత్త ఎస్ ఆర్ కె రెడ్డి వారు సూచిస్తున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*