వారితోనే చంద్రబాబు దీపావళి వేడుకలు 



Want create site? Find Free WordPress Themes and plugins.
ఆంధ్రప్రదేశ్ సి.ఎం చంద్రబాబునాయుడు ఈ సారి దీపావళిని దివ్యాంగులు, అనాధల మధ్య జరుపుకోనున్నారు. అక్టోబర్ 17న విశాఖ సముద్ర తీరంలో జరిగే ఈ వేడుకలకు 2 వేల మంది పిల్లలు హాజరుకానున్నారు. హుద్ హుద్ తుఫాన్ తో దెబ్బతిన్న వైజాగ్ రెండేళ్ల పాటు సరిగా దీపావళి వేడుకలకు దూరమైంది. అందుకే చంద్రబాబు ఈ సారి దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని కోరుతున్నారు. తాను అక్కడి వేడుకల్లో పాల్గొని ఆ పిల్లల్లో ఆనందం నింపనున్నారు. ఆనంద దీపావళి పేరిట నిర్వహిస్తున్న ఈ వేడుకలను అక్టోబర్ 17, 18న జరపనున్నారు. ఒంటరితనంతో శారీరకంగా, మానసికంగా బాధపడుతున్న పిల్లల్లో వెలుగులు నింపేందుకు ఈ కార్యక్రమం దోహదపడనుంది. 
                  కాలుష్యం లేని పటాసులనే ఈ సందర్భంగా వినియోగించాలని ముందుగానే చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. పెద్ద పెద్ద శబ్దాలు, పేలుళ్లతో పిల్లలు భయపడతారని.. అవి లేకుండా చూడాలని కోరారు. అందుకే ఆకాశంలో వెలుగులు విరజిమ్మే టపాసులకే వారు ప్రాధాన్యతనిస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించని టపాసులను వాడేందుకు ముఖ్యమంత్రి మొగ్గు చూపడం పట్ల పలువురు అభినందిస్తున్నారు. పేదలు,అనాధలు, దివ్యాంగుల సంతోషం కోసం ఇలాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించడాన్ని వారు స్వాగతిస్తున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*