లండన్ లో సిఆర్డీఏ బృందానికి ఏపీఎన్ఆర్టీ ఘన స్వాగతం



Want create site? Find Free WordPress Themes and plugins.

ఆంధ్రుల నగరి అమరావతి రాజధానిలో నిర్మించబోయే పరిపాలన, అసెంబ్లీ హైకోర్టు భవనాల ఆకృతులకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోనుంది ఏపీ ప్రభుత్వం. ఇందు కోసం రకరకాల డిజైన్లను పరిశీలించింది. తెలుగుదనం ఉట్టిపడేలా..రాజసం వచ్చేలా ఆకృతులను తీర్చిదిద్దనుంది. ఇందుకు ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి సహకారం తీసుకుంటోంది. ఇందులో భాగంగా సీఆర్డీఏ ఉన్నతాధికారుతులతో పాటు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, ప్రముఖ సినీదర్శకుడు రాజమౌళిల బృందం లండన్ కు వెళ్లింది.

            లండన్ ఎయిర్ పోర్ట్ లో అడుగు పెట్టిన ఏపీ అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఘన స్వాగతం పలికారు ఏపీ ఎన్ ఆర్టీ ప్రతినిధులు. లండన్ లోని ఏపీ ఎన్ ఆర్టీ ప్రతినిధి జయకుమార్ ఇందుకు నేతృత్వం వహించారు. ప్రవాసాంధ్రుల ప్రయోజనాల కోసం పాటుపడుతోంది ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు అసోసియేషన్ ( ఏపీ ఎన్ఆర్టీ). ఏపీ అధికారులు, ప్రజాప్రతినిధులు అక్కడకు రావడంతో తన సేవలను ప్రారంభించింది ఏపీ ఎన్ ఆర్టీ. లండన్ కు వెళ్లిన సీఆర్డీఏ ప్రతినిధులు అక్కడ నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

            కొన్ని రకాల డిజైన్లను పరిశీలించి… వాటికి మార్పులు, చేర్పులు సూచించే అవకాశముంది. ఆంగ్లంలో మంచి పట్టున్న టీడీపీ ఎంపీల్లో గల్లా జయదేవ్ ఒకరు. అందుకే అతన్ని ఇంగ్లండ్ పర్యటనకు సిఆర్టీఏ అధికారులతో సి.ఎం చంద్రబాబునాయుడు పంపారు. అక్కడి వారితో మాట్లాడేందుకు జయదేవ్ తన వంతు పాత్ర నిర్వహిస్తారు. బాహుబలి సినిమాతో తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేశారు ఎస్.ఎస్ రాజమౌళి. ఆ సినిమాలో వేసిన డిజైన్లు… రాజ ప్రాసాదాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అందరినీ అలరించాయి. అందుకే రాజమౌళిని పిలిపించి మరీ చంద్రబాబు మాట్లాడారు. డిజైన్లను చూపించారు. రాజధాని చుట్టూర తిరిగిన రాజమౌళి… కొన్ని సూచనలు చేశారంటున్నారు.

అందుకే స్వయంగా రాజమౌళినే మంత్రులు, అధికారులతో పాటు..లండన్ కు పంపింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే నార్మన్ ఫోస్టర్ డిజైన్ చేసిన ఆకృతులను పరిశీలించింది ఈ బృందం. ఏపీ నుంచి మార్పులు, చేర్పులు చెప్పే కంటే..అక్కడకు వెళ్లి మాట్లాడితేనే బావుటుందని భావించింది. అందుకే ఇప్పుడు లండన్ లో అడుగుపెట్టింది సిఆర్టీఏ బృందం. అక్కడి ప్రతినిధులతో మాట్లాడి తుది నిర్ణయం కోసం సి.ఎం చంద్రబాబుకు డిజైన్లను పంపనున్నారు. వాటిని పరిశీలించి…తుది నిర్ణయం తీసుకోనున్నారు సి.ఎం చంద్రబాబునాయుడు.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*