ఐలయ్య పుస్తకం పై సంచలన తీర్పుWant create site? Find Free WordPress Themes and plugins.
కంచె ఐలయ్యకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఐలయ్యకు అనుకూలంగా తీర్పునిచ్చింది అత్యున్నత ధర్మాసనం. ‘సామాజిక స్మగ్లర్లు కోమట్లు’ పుస్తకం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు నిచ్చింది. తమ కులాన్ని అవమానపర్చేలా ఉన్న పుస్తకాన్ని తక్షణమే నిషేధించాలని ఆర్యవైశ్య సంఘం నేత, ప్రముఖ న్యాయవాది రామాంజనేయులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది. దాన్ని కొట్టివేసింది. పుస్తకాన్ని మేము నిషేధించలేం. అలా చేస్తే భావప్రకటనా స్వేచ్ఛను హరించినట్లు అవుతుంది. అయితే, రచయితలు స్వీయనియంత్రణ పాటించాలి. అంతే తప్ప వివాదాస్పదం కారణంగా పుస్తకాన్ని రద్దు చేయాలని ఆదేశించలేమని న్యామూర్తులు వ్యాఖ్యానించారు.
                       పుస్తకాన్ని నిషేధించలేమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రచయిత ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య స్వాగతించారు. పుస్తకాలు నిషేధిస్తే భావప్రకటనా స్వేచ్ఛను హరించినట్లవుతుందని తీర్పునివ్వడం సంతోషానిచ్చిందన్నారాయన. కంచె ఐలయ్య రాసిన పోస్ట్‌ హిందూ ఇండియా పుస్తకం 2006లో హిందూ మతానంతర భారతదేశంగా తెలుగులోకి అనువాదమైంది. ఆ పుస్తకంలోని ‘కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు అధ్యయాన్ని విడిగా ముద్రించారు ఐలయ్య. ఈ పుస్తకం మార్కెట్ లోకి రావడం ఆలస్యం ఆర్యవైశ్యులు నిప్పులు చెరిగారు. ఐలయ్యను చంపేయాలని, ఉరి తీయాలని ఎంపీ టిజీ వెంకటేష్ లాంటి వారు ఆగ్రహించారు. తెలంగాణ, ఏపీల్లో ఐలయ్యకు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తాయి. ఒక దశలో ఐలయ్యపై ఆర్యవైశ్యుల దాడి చేసినంత పని చేశారు. ఐలయ్యకు మద్దతుగా దళిత, బహుజన సంఘాలు పోటీ ర్యాలీలు చేశాయి. ఈ క్రమంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు.
                     ఏపీలో ఆ పుస్తకాన్ని నిషేధిస్తామని ప్రభుత్వం ప్రకటించగా.. తెలంగాణలో ఆ ఊసే లేదు. ఫలితంగా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో ఐలయ్య ఇక మీదట స్వేచ్ఛగా తిరిగే వీలుంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.2 Comments

  1. BHAVA PRAKATANA SWECHANI STOP CHESE RIGHT LEDANI CONSTITUTION OF INDIA CHEPUTONDI.AMBEDKAR,SC,ST LAKI AGAINST GAA HINDUS KOODA BOOKS RAASINAA EVARUU BAN CHEYALERU

  2. Brahmanulu, vysyulu ithara kulala meeda pusthakalalu rasi prachristhe yemi anara. Bhavaprakatana swecchakinda yevari kulannaina kinchaparchukovacchuna. Narayana, yechuri, ilaiah sandhya, Goddar veedhulloki rarukada. Ithe ika andaru modalettandi.

Leave a Reply

Your email address will not be published.


*