గాంధీ పై ఉమా భారతి సంచలన వ్యాఖ్యలు



Want create site? Find Free WordPress Themes and plugins.
స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని జాతిపిత మహాత్మగాంధీ కోరారు. కానీ జవహర్ లాల్ నెహ్రు ఇందుకు ఒప్పుకోలేదు. అధికారం, పదవి కోసమే ఆయన ఒప్పుకోలేదనే వాదన వచ్చింది. ఫలితంగా భారత జాతీయ కాంగ్రెస్ కొనసాగింది. మధ్యలో ఇందిరా కాంగ్రెస్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జాతీయ కాంగ్రెస్ గా కొనసాగుతోంది. కాంగ్రెస్ నేతల సంగతి తెలిసే మహాత్ముడు అప్పుడు పార్టీని రద్దు చేయమన్నారని కేంద్ర మంత్రి ఉమా భారతి అన్నారు. 
        మహాత్మగాంధీ హత్యతో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా లబ్ది పొందిందని చెప్పారు. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ మాత్రం కష్టాలు పడాల్సి వచ్చిందని అన్నారు. ఉమాభారతి ప్రస్తుతం గుజరాత్  ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. పలు సభల్లో ఆమె ప్రసంగిస్తు ఓటర్లను ఆకట్టుకునే పని చేస్తున్నారు. మహాత్ముడి మరణం వల్ల లబ్ది పొందిన వారు, పార్టీ ఎవరో అందరికీ తెలుసునని ఉమా భారతి చెప్పడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపికైంది. గాంధీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్ పై నిషేధం పెట్టారని, అనేక మంది సంఘ్ నేతలను జైలుకు పంపారని, ఇటీవల కాలం వరకు సంఘ్ కార్యకర్తలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని గుర్తు చేశారు ఉమా భారతి. కాంగ్రెస్ వారి గురించి గాంధీజీకి బాగా తెలుసు కాబట్టే ఆయన కాంగ్రెస్ ను రద్దు చేయాలని కోరారని చెప్పారు. 
      మరోవైపు ఉమా భారతి వ్యాఖ్యలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. చనిపోయిన వారి గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికింది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*