విజయశాంతికి తెలంగాణ బాధ్యతలు



Want create site? Find Free WordPress Themes and plugins.
రాములమ్మ విజయశాంతి. ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. హస్తం పార్టీలో పెద్దగా ప్రభావం చూపలేక పోయారు. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కానీ ఇప్పుడు విజయశాంతిని సీన్ లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏఐసీసీ కార్యదర్శి పదవి ఇచ్చి తెలంగాణ పి.సి.సి ప్రచార బాధ్యతలను అప్పగించే ఆలోచన చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. ఇప్పటికే చర్చలు పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆజాద్ తో పాటు.. విజయశాంతిని తెలంగాణకు పంపి పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసే దిశగా కసర్తతు చేస్తోంది ఏఐసీసీ . అందుకే విజయశాంతితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. 
                  అసలు ఆమె పార్టీలో ఉందో లేదో తెలియదు. కానీ తిరిగి ఆమెను తీసుకువచ్చి ఏం చేద్దామని.. విజయశాంతి వల్ల ఒరిగే ఉపయోగం ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తున్నారు కొందరు కాంగ్రెస్ నేతలు. పైకి చెప్పక పోయినా అంతర్గతంగా వారు ఇదే మాటలు మాట్లాడుతున్నారు. అసలే కాంగ్రెస్ ఆ పై అంతర్గత స్వేచ్ఛ కాస్తంత ఎక్కువే. కాబట్టే ఈ మాటలంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆ పదవి నుంచి తప్పించి కొత్త వారికి బాధ్యతలు అప్పగించనున్నారు. వీలున్నంత త్వరగానే ఆ కసరత్తు పూర్తవుతుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.  
                      రాహుల్ గాంధీ, సోనియాగాంధీ ఆలోచనతోనే విజయశాంతిని తిరిగి ముందుకు నడిపించేందుకు సిద్దమయ్యారంటున్నారు. అందుకే ఎవరు ఎదురు చెప్పలేక అలాయని ఊరుకోలేక పోతున్నట్లు తెలుస్తోంది.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*