అద్భుతంగా జరిగిన టాటా ఫ్లోరిడా మీట్



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ( టాటా)ఆధర్వంలో జరిగిన తల్లహస్సీ ఫ్లోరిడా ఆత్మీయ సమావేశం అద్భుతంగా సాగింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను వ్యాపింపజేసేందుకు టాటా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా అమెరికా అంతటా తమ కార్యక్రమాలను విస్తరిస్తోంది. టాటా ప్రెసిడెంట్ ఝూన్సీరెడ్డి అధ్యక్షతన ఫ్లోరిడా రాజధానిలో జరిగిన ఈ మీట్ అమెరికాలోని తెలంగాణ వారిని ఒక చోటుకు చేర్చింది. టాటా ఏర్పాటయ్యాక ఇంత పెద్ద కార్యక్రమం జరగటం పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అంతా ఆత్మీయంగా పలకరించుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకున్నారు. 
                    ఫ్లోరిడాలో చరిత్రలోనే తొలిసారిగా ఇలాంటి కార్యక్రమం జరగడం పట్ల సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ వారే కాదు… ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టాటా వ్యవస్థాపక అధ్యక్షులు, సలహా మండలి కమిటీ ఛైర్మన్ పైలా మల్లారెడ్డి నాయకత్వంలో సంస్థ ఎలా ముందుకు వెళుతున్నది.. ఏం చేయనుంది వంటి విషయాలను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలు ఝూన్సీరెడ్డి వివరించారు. తెలంగాణ సమాజానికి సేవలందిస్తున్న సంగతిని ప్రస్తావించారు. డిసెంబర్, 2017 వరకు టాటా తెలంగాణ ప్రజల కోసం సేవా రోజుల పేరుతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఝూన్సీ. అంతేకాదు… ఫ్లోరిడా టాటా రీజినల్ వైస్ ప్రెసిడెంట్ హరివేమిరెడ్డితో పాటు.. పలువురు ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేశారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*