వర్మ సవాల్ ను స్వీకరించని సోమిరెడ్డి



Want create site? Find Free WordPress Themes and plugins.
అట్టు పెడితే అట్టున్నర పెట్టినట్లు అయింది. ఎరక్క పోయి వివాదస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మతో పెట్టుకున్నాడు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో రోజాను హీరోయిన్ గా తీసుకునే బదులు… లక్ష్మీ పార్వతిని హీరోయిన్ గా.. జగన్ ను నిర్మాతగా… జబర్దస్త్ టీమ్ ను కో-ఆర్టిస్టులుగా పెట్టుకోవాలని మంత్రి ఉచిత సలహానిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి రాం గోపాల్ వర్మ కౌంటరిచ్చాడు. వారెందుకు మీరు రండి హీరోగా పెట్టి సినిమా తీస్తానన్నారు వర్మ. గతంలో వంగవీటి సినిమా తీసి అట్టర్ ప్లాప్ అయ్యాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా అలా ఉంటుందని జోస్యం చెప్పారు సోమిరెడ్డి. 
          ఫలితంగా మెంటల్ ఎక్కినట్లు అయింది వర్మకు. అసలు మంత్రి సోమిరెడ్డికి దమ్ముంటే తనతో చర్చలకు రావాలని సవాల్ విసిరాడు. ఏ విషయం పైనా అయినా చర్చకు సిద్దమేనని చెప్పాడు. అమరావతి రాజధాని నిర్మాణానికి అంత డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదని వర్మ షాకింగ్ కామెంట్లు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలోను పోరాటం చేయాలన్నారు. 
           వర్మ సవాల్ ను స్వీకరించలేదు మరోవైపు సోమిరెడ్డి. నేనే కాదు.. మా పాలేరు అతనితో చర్చలకు వెళ్లడం ఇష్టపడరని చెప్పారు. అంత తీసి పారేసేలా వర్మను చూశారు మంత్రి. అనవసరంగా వర్మను, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను హైలెట్ తప్ప మరోకటి  లేదని.. సోమిరెడ్డి ఇప్పటికైనా అతని గురించి పట్టించుకోవడం మానేయాలనేది తెలుగు తమ్ముళ్ల వాదనగా ఉంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*