వర్మకు పాపులార్టీ తెస్తున్న సోమిరెడ్డి



Want create site? Find Free WordPress Themes and plugins.
వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఇందులో రోజాకు ఒక పాత్ర ఇస్తానని ప్రకటించారు. ఎవరూ పెద్దగా స్పందించలేదు. దీంతో ప్రచారం ఎలా వస్తుందా అని ఎదురు చూస్తున్నాడాయన. కానీ రానే వచ్చింది. అది మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రూపంలో. వేరే వాళ్లు ఎందుకు అసలు లక్ష్మీపార్వతినే హీరోయిన్ గా పెట్టుకుంటే పోలే అంటూ వర్మకు ఉచిత సలహానిచ్చాడు సోమిరెడ్డి. హీరోయిన్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదని వెటకారం చేశారు. అసలు ఈ చిత్రానికి నిర్మాతగా రాకేష్ రెడ్డికి బదులు వైఎస్ జగన్మోహన్ రెడ్డే అనే సంగతిని వర్మ అధికారికంగా ప్రకటిస్తే బాగుంటుందని చెప్పారు. 
              సోమిరెడ్డి వ్యాఖ్యలు టీడీపీకి ఇబ్బందిగా మారనున్నాయి. అసలే తేడాగా మాట్లాడతాడు. అతనితో పెట్టుకునే కంటే ఊరుకోవడం మేలనుకుంటున్నారు మెజార్టీ నేతలు. అందుకే తెలుగు తమ్ముళ్లంతా వ్యూహాత్మకంగా కావాలని మౌనం దాల్చారు. అయినదానికి.. కానిదానికి స్పందించడం సోమిరెడ్డికి కొత్తేం కాదు. ఇప్పుడు వర్మ పైనా కామెంట్ చేసాడు. తన ప్రచారానికి సోమిరెడ్డి బాగా పనికి రావడంతో వర్మ చాలా సంతోషంగా ఫీలవుతున్నాడట. అర్జున్ రెడ్డి సినిమా సక్సెస్ కు కాంగ్రెస్ నేత విహెచ్ వ్యతిరేకత బాగా పని చేసింది. ఆర్టీసీ బస్ కు అంటించిన సినిమా వాల్ పోస్టర్ ను విహెచ్ చింపేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా వర్మ, విహెచ్ ల మధ్య సాగిన మాటల యుద్దంతో అర్జున్ రెడ్డికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. 
                ఇప్పుడు వర్మ తీస్తున్న లక్ష్మీ ఎన్టీఆర్ చిత్రానికి అంతే స్థాయిలో ప్రచారం తీసుకువచ్చేందుకు తనకు తెలియకుండానే సోమిరెడ్డి ప్రయత్నిస్తున్నాడు. వర్మను పట్టించుకోక పోతే ఏం కాదు. కానీ సోమిరెడ్డి అలా ఊరుకునే రకం కాదనే వాదన ఆ పార్టీలోనే సాగుతోంది.   
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*