ఆరుషి హత్య కేసులో సంచలన తీర్పు



Want create site? Find Free WordPress Themes and plugins.
       ఆరుషి కేసులో సంచలన తీర్పు వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో నోయిడాలో పదేళ్ల క్రితం జరిగిన ఆరుషి హత్య కేసులో ఊహించని ట్విస్ట్‌ ఎదురైంది. 2013 నుంచి జీవితఖైదు అనుభవిస్తున్న ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు. సీబీఐ కోర్టు విధించిన జీవితఖైదును ఆరుషి తల్లిదండ్రులు అలహాబాద్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. బెన్‌ఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద వారిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు సీబీఐ సరైన ఆధారాలు చూపలేకపోయిందని చెప్పింది. 
       ఫలితంగా ఆరుషి హత్యకేసులో ఆమె తల్లిదండ్రులకు ఊరట లభించింది. ఆరుషిని ఆమె తల్లిదండ్రులే చంపారనేందుకు సరైన ఆధారాలు లేవని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆధారాలు సమర్పించడంలో సీబీఐ విఫలమైందని కోర్టు పేర్కొంది. పద్నాలుగేళ్ల తమ కుమార్తె ఆరుషి, పనిమనిషి హేమరాజ్‌లు హత్యకు గురైన సంగతి తెలిసిందే. తన కూతురు అందులోను పని మనిషితో ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు ఈ హత్య చేశారని సిబిఐ బలంగా నమ్మింది. ఆధారాలను ఇచ్చింది. నిందితులకు శిక్ష పడాలంటే ఈ ఆధారాలు సరిపోవని కోర్టు అభిప్రాయపడింది. హత్య కేసులో దంతవైద్య నిపుణులు రాజేశ్, నూపుర్ తల్వార్ దంపతులను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించగా…ఘజియాబాద్‌లోని దస్నా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అలహాబాద్‌ హైకోర్టు తీర్పును ఆరుషి తాత స్వాగతించారు. రాజేశ్‌‌, నూపుర్ తల్వార్ ఎలాంటి తప్పు చేయలేదని తమకు తెలుసు అని ఆయన అన్నారు. 
         కూతురు ఎలాగు చనిపోయింది. తల్లిదండ్రులు ఇప్పటికే చాలా కాలం జైలు జీవితం అనుభవించారు. ఇక ఇప్పుడు వారిని శిక్షించి ఏం ప్రయోజనం అనే రీతిలోనే ఆరుషి తల్లిదండ్రులను వదిలి పెట్టారనే వాదన లేకపోలేదు.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*