మహిళా టాయిలెట్ లోకి వెళ్లిన రాహుల్



Want create site? Find Free WordPress Themes and plugins.
చిన్న పొరపాటు ఎంత ప్రచారానికైనా నోచుకుంటోంది. అందులోను ప్రముఖులు చేసే పనులు అయితే ఇక ఆగవు. ఎంత పెద్ద నాయకులు అయినా తప్పులో కాలేస్తుంటారు. ఎ.ఐ.సి.సి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అదే పని చేశారు.  పొరపాటున లేడీస్ టాయిలెట్ లోకి వెళ్లడం పెద్ద వార్త అయింది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బిజిగా ఉన్న రాహుల్ ఉడేపూర్ జిల్లాలో పర్యటించారు. రాహుల్ ‘సంవాద్‌’ పేరిట సదస్సును నిర్వహించారు. ఈ సదస్సు ముగిసిన తర్వాత ఆయన టౌన్‌హాల్‌ నుంచి బయటకు వస్తూ లేడీస్‌ టాయ్‌లెట్‌లోకి వెళ్లారు. దాని పై ఎలాంటి బోర్డు లేదు. అది మహిళలదా… పురుషులదా అనే సంకేతాలు లేవు. కానీ గుజరాతీలో మహిళల మరుగుదొడ్డి అని రాసి ఉందట. రాహుల్‌కు గుజరాతీ రాదు. అందుకే అది తెలియక లోపలకు వెళ్లారు. ఇంకేముంది రాహుల్ గాంధీకి ఏం పాలుపోలేదు. తెలియకనే అలా మహిళల టాయ్‌లెట్‌లోకి వెళ్లారని ఇక కాంగ్రెస్ వర్గాలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయం మీడియాకు తెలిస్తే ఆగుతుందా… విజువల్స్ తీసేందుకు ప్రయత్నించాయి. 
                     సహజంగానే ఆయన పక్కన ఉన్న మందీ మార్భలం, అనుచరులు దాన్ని అడ్డుకున్నారు. ఈ లోపు లోపల నుంచి రాహుల్ బయటకు రాగానే అంతా నవ్వేశారు. వారితో నవ్వేసిన రాహుల్ కు తర్వాత అసలు విషయం తెలిసిందట. అవునా… మరి చెప్పలేదేం అనేశారట. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*