అమెరికాలో పెరుగుతున్న తెలుగు మాట్లాడే వారి సంఖ్య 



Want create site? Find Free WordPress Themes and plugins.
అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య బాగా పెరుగుతుందట. అక్కడ తెలుగు మాట్లాడే వారు మూడో స్థానంలో ఉన్నారు. అమెరికా సామాజిక సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అమెరికాలో ఉన్న భారతీయులలో హిందీ, గుజరాతి తర్వాత తెలుగుకు ఆ ప్రాముఖ్యత దక్కింది. బెంగాలీ,తమిళ భాషలను అధిగమించి తెలుగు మాట్లాడేవారి సంఖ్య పెరగడం విశేషం. ఉర్దూ భాష మాట్లడేవారు తెలుగు కంటే ఎక్కువగా ఉన్నారు. మరోవైపు పాకిస్తాన్ వాళ్లు ఉర్దూ మాట్లాడతారు. అయినా సరే భారతీయులలో చూస్తే తెలుగుకు మూడో స్థానం దక్కింది. హిందీ 8,10,877 మంది, గుజరాతి 4,07,520, తెలుగు 3,65,566 మంది మాట్లాడుతున్నట్లు లెక్కగట్టారు.
                ఇండియాకు చెందిన భాషల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్న భాషగా తెలుగుకు మంచి గుర్తింపు వచ్చింది. అమెరికాలో ఇండియన్లు ఎక్కువే. సాఫ్ట్ వేర్ కంపెనీలు ఎక్కువగా ఉన్న చోట భారతీయుల సంఖ్య చాలా ఎక్కువ. అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇండియన్లతో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారిపై వీసా నిబంధనలను కఠినతరం చేశారు. హెచ్ 1 బీ వీసాల విషయంలోను ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఇండియాకు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీలు చాలా వరకు ఇబ్బందిపడ్డాయి. 
                      అమెరికాలో నివసిస్తున్న ఐదేళ్ళకు పైబడిన వయస్సున్న వారిలో తెలుగు వారు 0.12 శాతంగా ఉన్నారని ఈ నివేదిక తేటతెల్లం చేస్తోంది. అమెరికాలో ఐదేళ్ళ వయస్సు పైబడిన వారిలో సుమారు 30,33,28,961 మంది నివసిస్తున్నారు. బెంగాలీ, ఉర్దూ,తమిళ్ భాషలను మాట్లాడే వారి సంఖ్య కూడ గణనీయంగా ఉందని ఈ సర్వే చెబుతోంది. ప్రతి ఏటా 80వేల హెచ్ 1 బీ వీసాలు అమెరికా జారీ చేస్తోంది. కానీ 2001లో 50 శాతం వీసాలు తెలుగు ప్రజలు పొందారని ఆ లెక్కలు చెబుతున్నాయి.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*