పడక గదికి రమ్మన్నారన్న నటి



Want create site? Find Free WordPress Themes and plugins.
         మళయాళీ నటి భావన లైంగిక వేధింపుల సంగతి తెలిసిందే. దీని పై ఇప్పుడు కేసులు జరుగుతున్నాయి. సినిమా అవకాశాల కోసం హీరోయిన్లు చాలానే పోగొట్టుకోవాల్సి వస్తోంది. కొందరు దర్శకులు, నిర్మాతలు, హీరోలు చేసే లైంగిక వేధింపులు చాలానే ఉన్నాయనే ఆరోపణలు లేకపోలేదు.  హీరోయిన్లను మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు పెడుతున్నా భరించిన వాళ్ళు లేకపోలేదు. పరిశ్రమలో నిలదొక్కుకోవాలనే ఆలోచనతో కొందరు సమ్మతిస్తుండగా..మరికొందరు కాదంటున్నారు. ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ ఇందుకు ఒప్పుకోలేదు. తనకు ఎదురైన సంగతిని బాహాటంగానే చెప్పేసింది. 
      ఆమెనే కాదు..చాలా మంది సినిమా నటీమణులు ఇండస్ట్రీలో తమకు జరిగిన అవమానాలు, తాము ఎదుర్కున్న లైంగిక వేధింపులను ఏకరువు పెడుతున్నారు. తనను ఓ హీరో లైంగికంగా వేధించారని నటి కస్తూరు ఆరోపించారు. అందుకు కాదని చెప్పడంతో సినిమా అవకాశాలు రాకుండా చేశారని వాపోయింది. గతంలో హీరోయిన్ రెజీనాను గెస్ట్ హౌవుస్ కు రావాలని తమిళ నిర్మాత ఒకరు అడిగారు. అందుకే ఆ సినిమాలో నటించలేదు రెజీనా. ఓ ఇంటర్వూలో ఇదే విషయం చెప్పేసింది ఆ భామ. 
        ఇక బాలీవుడ్‌లో కాంట్రావర్సీలకు కేంద్ర బిందువుగా ఉంటోంది అందాల తార రాధికా ఆప్టే. తెలుగులోను బాలకృష్ణ సరసన రెండు సినిమాల్లో నటించింది. తమిళం కబాలీలో రజనీకాంత్ భార్యగా నటించి మెప్పించింది. ఫ్రీ పబ్లిసిటీని కోరుకునే రాథిక ఆప్టే తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. పరిశ్రమలో హీరోయిన్లను బెడ్ రూముకు పిలిచే సంప్రదాయం దక్షిణాదిన ఉందని చెప్పుకొచ్చింది. తనను కథా చర్చలకు రమ్మని ఓ నిర్మాత పిలిచి పడక గదికి రమ్మంటే తాను అంగీకరించలేదని చెప్పింది. అందు వల్లనే తనకు దక్షిణాదిలో ఎక్కువగా అవకాశాలు రాలేదని వాపోయింది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*