జగన్ పాదయాత్ర 125 నియోజకవర్గాల్లోనే



Want create site? Find Free WordPress Themes and plugins.
వైకాపా అధినేత జగన్మోహనరెడ్డి పాదయాత్ర 125 నియోజక వర్గాలు మాత్రమే సాగనుంది. మిగతా నియోజకవర్గాల్లో జగన్ బస్సు యాత్ర చేసేందుకు సిద్దమయ్యారు. పాదయాత్ర చేయని నియోజకవర్గాల్లో తమకు పట్టు ఉందని వైకాపా భావిస్తోంది. అందుకే అక్కడ బస్సు యాత్రలకు సిద్దమైంది. పార్టీకి బలంలేని చోట పాదయాత్ర చెయ్యటం ద్వారా కొంతబలం పుంజుకోవచ్చని అంచనా వేస్తోంది. 3 వేల కిలోమీటర్లు, ఆరునెలల పాటు పాదయాత్ర అంటే మాటలు కాదు. ఆరు నెలల్లో 175 నియోజకవర్గ్గాల్లో పాదయాత్ర అంత తేలిక కాదు. అందుకే జగన్ ఈ నిర్ణయానికి వచ్చారంటున్నారు. ఇప్పుడు రూటు మ్యాప్ మారనుంది. 
           ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి తీరుతానని జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. నవంబర్ 2 నుంచి ప్రారంభమయ్యే యాత్రకు కోర్టు అనుమతి ఇస్తుందా లేదా అనే ఉత్కంఠ రేపటితో తొలగనుంది. కానీ ఈ లోపే ఆ పార్టీ నేతలు పాదయాత్ర పై కసరత్తు పూర్తి చేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్దమేనని మేకపాటి రాజమోహన్ రెడ్డి వంటి నేతలు ప్రకటించారు. గతంలో ఎంపీల రాజీనామాలపై స్పందించని ఆయన ఇప్పుడు మేము రెడీ అనే సంకేతాలు ఇవ్వడం విశేషం. 
           జగన్ ఒక్కసారి అవకాశం ఇవ్వాలనే కొత్త నినాదాన్ని ముందుకు తీసుకెళ్లనుంది ఆ పార్టీ. ఈ నినాదానికి ప్రజాదరణ ఎలా ఉంటుందో చూడాలి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*