జనాన్ని పోగేయాల్సిందే : వైసీపీ ఇన్ఛార్జులకు ఫత్వా



Want create site? Find Free WordPress Themes and plugins.

వైఎస్ జగన్మోహన రెడ్డి పాదయాత్రకు ఇప్పుడు పూర్వరంగం సిద్ధం చేస్తున్నారు. సన్నాహక కార్యక్రమాలు మొదలైనట్లే లెక్క. శుక్రవారం కోర్టుకు గైర్హాజరు అయ్యే వెసులుబాటును న్యాయస్థానం కల్పిస్తుందో లేదో తెలియదు. కానీ.. ఆ వెసులుబాటు ఎలా ఉన్నా సరే.. పాదయాత్ర మాత్రం చేసితీరాల్సిందే అనే నిర్ణయానికి జగన్మోహన రెడ్డి వచ్చేశారు. దీనికి సంబంధించి ఏర్పాట్ల గురించి మాట్లాడడానికే రాష్ట్రంలోని అందరు కీలక నాయకులు, పార్టీ నియోజకవర్గాల ఇన్ ఛార్జిలు అందరినీ జగన్ పిలిపించారు కూడా! ఈ సమావేశంలో తన పాదయాత్ర జరిగే రూట్ లోకి జనాన్ని పోగేసే బాధ్యతను ఇన్ ఛార్జిలకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. సన్నాహక సమావేశం అంటే.. జనాన్ని సమీకరించడం గురించిన లక్ష్యాలను పార్టీనేతలకు పురమాయించడమే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు చాలా నియోజకవర్గాల్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో పోటీచేసిన వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గెలిచిన వారు కూడా ఎక్కడా ఆర్థికంగా సంతృప్తిగా లేరు. ఓడిపోయిన వారి పరిస్థితి సరే సరి! పార్టీ గెలుస్తుందనే నమ్మకంతో గత ఎన్నికల్లో అప్పులు చేసి ఖర్చు చేసిన వారు ఇప్పటికీ చాలా ఇబ్బందులో ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాంటి నేపథ్యంలో జగన్ పాదయాత్రకు జనాన్ని సమీకరించడం అనేది ప్రతి ఒక్కరికీ  కూడా భారంగానే మారే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. అందుకే జగన్ ఈ సమావేశం నిర్వహించి.. జన సమీకరణ వియంలో విధిగా అందరూ తమ సత్తా నిరూపించుకోవాల్సిందే అని.. ఎవరికైనా ఇబ్బంది ఉంటే నియోజకవర్గాల ఇన్ ఛార్జిలను మార్చి వేరే వారికి బాధ్యతలు అప్పగిస్తాం అనే స్థాయిలో వారికి పరోక్షంగా హెచ్చరికలు చేసినట్లుగా తెలుస్తోంది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జన సమీకరణ పరంగా ఎలాంటి వైఫల్యం ఎదురైనా పార్టీ కి ఉండగల అవకాశాలపై అది దారుణంగా ప్రభావం చూపుతుందనే భయం అందరిలోనూ ఉంది. పైగా పాదయాత్ర వంటివి చేపడుతున్నప్పుడు జనసమీకరణ కూడా చాలా కష్టమైన వ్యవహారం.. నాయకుడు పలానా ఊరికి సరిగ్గా ఎన్ని గంటలకు చేరుకుంటాడో తెలియదు. పోగేసిన జనాన్ని దాదాపుగా రోజంతా పోషించాల్సి ఉంటుంది. దానికి తగ్గట్లుగానే వారికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా చాలా ఆర్థిక భారంతో కూడుకున్న పని అని పలువురు పార్టీ ఇన్చార్జిలు భావిస్తున్నారు. జగన్ పర్యటించే మార్గంలో ఆయన కలిసే ప్రజల్ని ఎంపిక చేయడమూ వారికి ముందే చంద్రబాబును తిట్టేలా బ్రీఫింగ్ ఇవ్వడమూ ఈ బాధ్యతను మొత్తం రూట్ మ్యాప్ లోని నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జులు తీసుకోవాలనే ఒత్తిడి పెరుగుతోంది. అయితే పాదయాత్ర సక్సెస్ అయితే తప్ప పార్టీకే మనుగడ ప్రమాదం గనుక.. అందరూ ఈ ఖర్చుకు వెనుకాడకపోవచ్చుననే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*