కోర్టు అనుమతిస్తే తప్ప పాదయాత్ర కుదరదా?



Want create site? Find Free WordPress Themes and plugins.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం బెయిల్ పై బయటఉన్న నిందితుడు. ఆయనను రిమాండుకు పంపినకేసులు అన్నీ ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి. ఆయనపై మోపబడిన అభియోగాల నుంచి ఇంకా ఆయనకు ఇసుమంత విముక్తి కూడా లభించనే లేదు. ఆయన ఇప్పటికీ ప్రతి శుక్రవారం విధిగా కోర్టు ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అలాగే.. తన కదలికలకు సంబంధించి కోర్టు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో… జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయాలంటే.. కోర్టు అనుమతిస్తే తప్ప కుదరదా? కోర్టునుంచి ఆయన పాదయాత్రకు అనుమతి దొరుకుతుందా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.

తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కోర్టు అనుమతి తీసుకోకుండానే అసలు తాను పాదయాత్ర చేయబోతున్నట్లు ఎలా ప్రకటిస్తారు? అంటూ తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఒక రకంగా ఇది సబబైన ప్రశ్నలాగానే కనిపిస్తోంది. బెయిల్ మీద బయట తిరుగుతున్న నిందితుడిగా.. జగన్మోహన్ రెడ్డి.. తను ఎక్కడకు వెళ్లినా ప్రతిసారీ కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన ఇప్పటికీ విదేశీ పర్యటనలు గట్రా వెళ్లినప్పుడు కోర్టును అనుమతి అడిగి ఆ తర్వాతనే వెళుతుంటారు.

ఈ  సందర్భంలో మాత్రం ఆయన కోర్టు అనుమతికి ఇంకా దరఖాస్తు చేసుకోలేదు. కాకపోతే.. తాను చేయదలచుకుంటున్న పాదయాత్ర కు ఇబ్బంది లేకుండా.. కోర్టుకు హాజరీలనుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన ఏకంగా హైకోర్టును కోరారు. కాకపోతే.. కోర్టు జగన్ కు తీవ్రంగా అక్షింతలు వేసింది. అసలు ఆయన పాదయాత్ర ఉద్దేశాల మీదనే అనుమానాలు వెలిబుచ్చింది. రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నట్లుగా అనుకోవాల్సి వస్తోందని న్యాయస్థానం కామెంట్ చేసింది. దాంతో జగన్ మళ్లీ అనుమతి గైర్హాజరీ అనుమతి కోసం సీబీఐ కోర్టునే ఆశ్రయించారు. వారు ఇంకా ఏ సంగతి తేల్చలేదు.  గైర్హాజరీ అనుమతి తర్వాత.. అసలు పాదయాత్రకు కూడా కోర్టు అనుమతి ఉండాల్సిందే కదా.. జగన్ ఆ అనుమతి లేకుండానే.. తనంత తాను ప్రజల్లో ప్రకటన చేసేయడం ద్వారా కోర్టు మీద ఒత్తిడి పెంచదలచుకుంటున్నారా అని తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ వారు మాత్రం కోర్టు అనుమతులు అవసరం లేదని వ్యాఖ్యానిస్తూ ఉండడం గమనార్హం. రాష్ట్రంలో ఎక్కడైనా ఎప్పుడైనా తిరగడానికి జగన్ కు అనుమతి ఉందని, దేశం విడిచి వెళ్లేప్పుడు మాత్రమే కొత్తగా అనుమతి తీసుకోవాలని వారు వాదిస్తున్నారు. 

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*