పవన్ కు బొత్స రాయబారం



Want create site? Find Free WordPress Themes and plugins.
బొత్స సత్యనారాయణ. పి.సి.సి మాజీ అధ్యక్షుడు. ఇప్పుడు వైకాపాలో కీలక నేత. ఒకప్పుడు ఉత్తరాంధ్రను తన కనుసైగలతో ఆడించాడు. మంత్రిగా ఆటాడుకున్నారు. అదంతా గతం.  సీన్ మారింది. కళ్లు అప్పగించి చూసిన పెద్దగా పట్టించుకోవడం లేదనే సెటైర్ ఆయన మీద పేలుతోంది. వైకాపాలో అంతా తానై నడిపిద్దామనుకున్నాడు. జగన్ కు దగ్గరుండి మరీ సలహాలిచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ అంత తేలికగా అది జరిగే పనికాదని ఆలస్యంగా అర్థమైందట. అందుకే జనసేన వైపు మొగ్గు చూపేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పవన్ కు అతి సన్నిహితుడైన నేతతో కబురు పంపినట్లు సమాచారం. ఇందుకు పవన్ వైపు నుంచి రెడ్ సిగ్నల్ అందినట్లు టాక్. అందుకే బొత్సకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైందని వాదనుంది. 
                   కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలిగిన బొత్స భవిష్యత్ అడ కత్తెరలో పడ్డ పోక చెక్కలా మారిందంటున్నారు. టీడీపీ ద్వారాలు ఎలాగు మూసుకుపోవడం, కాంగ్రెస్ కు అంత సీన్ లేకపోవడం, జగన్ తో అంతగా ఇమడలేక పోవడం, పవన్ తో జతకట్టే ఎత్తు పారక పోవడమే ఇందుకు కారణమంటున్నారు. ఇలాంటి సమయంలో బొత్స నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఆసక్తికర చర్చ నడుస్తోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*