ఎన్టీఆర్ బయోపిక్ పై బాలయ్య ఎత్తులు



Want create site? Find Free WordPress Themes and plugins.
         ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీయాలని ఆయన కుమారుడు ‘బాలకృష్ణ’ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాం గోపాల్ వర్మను దర్శకుడిగా అనుకున్నా..ఎందుకో అది బెడిసి కొట్టింది. అసలు బాలయ్యను కలవక ముందే తాను సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు వర్మ. తెర వెనుక జరిగిన కొన్ని సంఘటనలు వర్మ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకునేందుకు దారితీశాయని తెలుస్తోంది. ఆ తర్వాత విడిగానే రాం గోపాల్ వర్మ ఎన్టీఆర్ పై సినిమా తీసేందుకు సిద్దమయ్యారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు ప్రకటించాడు. నిర్మాతగా పలమనేరుకు చెందిన రాకేష్ రెడ్డి ముందుకు వచ్చారు. ఇక సినిమాలో లక్ష్మీపార్వతి పాత్రలో రోజాను పెడుతున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్ పాత్రలో ప్రకాష్ రాజ్ ను ఎన్నుకుంటున్నట్లు తెలుస్తోంది. 
        మొత్తంగా ఈ సినిమా సంగతులు మీడియాకు మంచి మేతగా మారాయి. హీరోయిన్ గా లక్ష్మీపార్వతిని పెట్టాలని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉచిత సలహానివ్వడంతో అది కాస్త రచ్చ అయింది. జగన్ నిర్మాతగా, జబర్దస్త్ నటులను కో-ఆర్టిస్టులుగా పెట్టాలన్నారు. మీ ఉచిత సలహాకు ధన్యావాదాలు, ఎవరో ఎందుకు మిమ్మలనే హీరోగా పెడతానంటూ వర్మ మంత్రిని ఉద్దేశించి సెటైర్ వేశారు.  
       ఇదిలా ఉంటే ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించే దర్శకుడి కోసం బాలయ్య ఎదురు చూస్తున్నారు. తొలిగా క్రిష్..లేదా తేజకు ఈ సినిమా బాధ్యతలను అప్పగించాలని బాలయ్య యోచించారని టాక్. గౌతమీ పుత్ర శాతకర్ణి బాగా తీశారు క్రిష్. అందుకే ఆయన వైపు మొగ్గు చూపినా…మణికర్ణిక ప్రాజెక్టుతో బిజీగా ఉండడంతో మరో దర్శకుడి కోసం బాలయ్య ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే తేజకు ఆ బాధ్యతలు అప్పగిస్తున్నారనే చర్చ జరుగుతోంది. నేనే రాజు నేనే మంత్రి సినిమా మంచి విజయాన్ని సాధించడంతో తేజ మీద నమ్మకం పెరిగిందంటున్నారు. అందుకే ఎన్టీఆర్ షూటింగ్ ప్రారంభించేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందే ఈ సినిమా తీసి ప్రజల్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే ఈ సినిమాకు బాలకృష్ణ నిర్మాతగా మారనున్నారని మరో చర్చ సాగుతోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*