మళ్లీ తెరపైకి ఆజాద్



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇంఛార్జ్ గా తిరిగి ఆజాద్ తెరపైకి రానున్నారు. ఇందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటున్నారు. పదేళ్ల పాటు దిగ్విజయ్ సింగ్ పార్టీ ఇంఛార్జ్ గా వ్యవహరించారు. చివరకు ఆయన వల్ల లాభం చేకూరక పోగా పార్టీ సీనియర్లు చాలా మంది బయటకు వెళ్లారు. కేకే, డిఎస్ వంటి పి.సి.సి మాజీ అధ్యక్షులు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లోకి కాంగ్రెస్ ను తీసుకెళ్లడంలో ఆయన విఫలమయ్యారు. అందుకే ఇప్పుడు తిరిగి ఆజాద్ ను పంపనుంది. 
            డిగ్గీరాజా స్థానంలో తాత్కాలికంగా కుంతియాను నియమించినా ఆయనతో స్థానిక కాంగ్రెస్ నేతలు పొసగడం లేదు. పి.సి.సి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెబితే అది చేయడం మినహా కుంతియా ప్రణాళిక అంటూ లేకుండా పోయిందనే విమర్శలున్నాయి. అందులో నేతలను కలుపుకుపోయే విషయంలో విఫలమయ్యాడు కుంతియా. ఫలితంగా కుంతియాను తొలగించాలని పార్టీ పెద్దలకు ఫిర్యాదులు అందాయి. దాంతో ఆయన స్థానంలో తిరిగి గులాం నబీఆజాద్ ను నియమించనుంది కాంగ్రెస్. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 
           ఇటీవల కోమటిరెడ్డి సోదరులు పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. ఇటు ఉత్తమ్, అటు కుంతియా వ్యవహార శైలి వారికి నచ్చలేదు. ఫలితంగా వారిని పిలిపించి మాట్లాడటమే కాదు.. నేను వస్తాను. మీరు కాస్త ఆగండి. అంతా మేలు జరుగుతుందని ఆజాద్ హామీనిచ్చారు. అదే సమయంలో పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీతోను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడి వచ్చారు. ఆ తర్వాత పార్టీ మారే ఆలోచనను కోమటిరెడ్డి బ్రదర్స్ తాత్కాలికంగా విరమించుకున్నారు. ఇప్పుడు తమకు మద్దతుగా నిలిచే ఆజాద్ వస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ను వీడే ఆలోచన చేసేది లేదంటున్నారట వాళ్లు. వారే కాదు.. తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఏకతాటిపైకి తీసుకురావడంలో డిగ్గీరాజా పూర్తిగా చేతులెత్తేశాడు.
         రాబోయే ఎన్నికల్లో తెలంగాణ గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది కాంగ్రెస్. అందుకే పార్టీకి మేలు జరిగే అన్ని అంశాల పైనా సత్వరమే నిర్ణయం తీసుకుంటోంది. ఆజాద్ రాకతో తెలంగాణకు తిరిగి కొత్స ఉత్సాహం వస్తుందనే ప్రచారం సాగుతోంది.     
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*