జగన్ పాదయాత్రకు అనుమతి వస్తుందనే ధీమా



Want create site? Find Free WordPress Themes and plugins.
         ఏపీలో నవంబర్ 2 నుంచి జగన్ పాదయాత్ర చేస్తున్నాడు. ఇందుకు రోడ్ మ్యాప్ సిద్దమైంది. ఆరు నెలల పాటు మొత్తం 3 వేల కిలోమీటర్ల దూరం ఈ యాత్ర సాగనుంది. ఇడుపులపాయ నుంచి అనంతపురం మీదుగా ఇచ్చారపురం వరకు ఈ యాత్ర సాగనుంది. ప్రజల వద్దకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని సిబిఐ కోర్టును కోరాడు జగన్. శుక్రవారం దీని పై నిర్ణయం తీసుకోనుంది న్యాయస్థానం. అక్రమాస్తుల కేసులో విచారణను ఎదుర్కుంటున్నాడు వైకాపా అధినేత జగన్. ఫలితంగా ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. విదేశాలకు వెళ్లాలన్నా..ఏదైనా మినహాయింపు కావాలన్నా ముందు కోర్టు అనుమతి తీసుకుంటున్నారు జగన్. 
         గుంటూరులో జరిగిన వైకాపా సభకు అనుమతి లేకుండానే తన లాయర్ ను పంపడంతో కోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. మరోసారి ఇలా చేయవద్దని చెప్పింది. ఫలితంగా ఇప్పుడు కోర్టు అనుమతి ఇస్తుందా లేదా అనే సందిగ్దత ఏర్పడింది. 2014 ఎన్నికల సమయంలో జగన్ ఇలానే సిబిఐ కోర్టును అనుమతి కోసం కోరాడు. అప్పుడు మూడు నెలల పాటు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు అంతే చేస్తుందని నమ్ముతున్నాడు జగన్. అందుకే అంత ధీమాగా పాదయాత్రకు సిద్దమవుతున్నాడు. ఆరు నెలలు ఇవ్వకపోయినా మూడు నెలలు ఇచ్చినా చాలు అని అనుచరులకు చెబుతున్నాడట. మిగతా మూడు నెలలు ఏలాగైనా నడిపించవచ్చని చెబుతున్నట్లు తెలుస్తోంది. 
        తన పార్టీ ప్రధాన కార్యాలయాన్ని బెజవాడకు మార్చిన జగన్..ఇప్పుడు అక్కడ నుండే కార్యకలాపాలను సాగిస్తున్నాడు. వీలున్నంత వరకు లూటస్ పాండ్ ను వదిలేసే ఆలోచన చేస్తున్నారట. తమ పార్టీ ప్రధాన సలహాదారు ప్రశాంత్ కిషోర్ సలహాతో ప్రత్యేక హోదా పై అనంతపురంలో యువభేరి నిర్వహించాడు. బీజేపీ పై ఒత్తిడి తేవడమే ఈ సభ అసలు ఉద్దేశం అనే వాదన లేకపోలేదు. హోదా సంగతి ప్రస్తావిస్తే ఏపీలో బీజేపీని జనం నమ్మే పరిస్థితి ఉండదు. అది ఒక రకంగా కమలం పార్టీకి దెబ్బేనని చెప్పాలి. హోదా పై నిజంగా పోరాడే వారు అయితే..ఎంపీలతో రాజీనామా చేయిస్తానని చెప్పినప్పుడే ఆపని చేయాలి. కానీ వెనక్కు తగ్గడమే కాదు..బీజేపీ నేతలకు మద్దతుగా మాట్లాడటం, బీజేపీ ప్రతిపాదించిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి అభ్యర్థులకు మద్దతునివ్వడంతో ఇందులో రాజకీయ కోణం ఉందనే ప్రచారం ఉంది.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*