పయ్యావుల కేశవ్ ఎందుకు టార్గెట్ అయ్యారంటే



Want create site? Find Free WordPress Themes and plugins.
పయ్యావుల కేశవ్. అనంతపురం జిల్లాలో టీడీపీకి గట్టి నేత. ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం. పోయినసారి ఎన్నికల్లో వైకాపా నేత విశ్వేశ్వర్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు. అయినా సి.ఎం చంద్రబాబునాయుడు ఆ యువనేతను గౌరవించాడు. ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు. మంత్రి పదవి వస్తుందనుకున్న పయ్యావులకు చుక్కెదురైంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికీ అదే జిల్లాలో మంత్రి పదవి ఇవ్వడం కష్టమైంది. అప్పటికే పరిటాల సునీత ఉండటమే ఇందుకు కారణం.
              అక్కడే కాదు… ఒకే సామాజిక వర్గం అనే కారణంతో గుంటూరు జిల్లాలో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, కొమ్మాలపాటి శ్రీధర్, శివశక్తి ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ లకు కేబినెట్ లో చోటు దక్కలేదు. ప్రత్తిపాటి పుల్లారావు కేబినెట్ లో ఉండగా.. కోడెల శివ ప్రసాద్ రావు స్పీకర్ గా వెళ్లిన సంగతి తెలిసిందే. సమర్థులైన ఏడుగురిలో ఒక్కరికే మంత్రి వర్గంలో చోటు దక్కింది. అదే తీరులో అనంతలోను చోటు ఇవ్వలేదు. 
            ఇలాంటి సమయంలో తనకు ఇచ్చిన అవకాశాన్ని పయ్యావుల సద్వినియోగం చేసుకోవాలి. మంత్రి పదవి ఇవ్వలేదనే కారణంతో టీడీపీ తీరును అంతర్గత సమావేశాల్లో పయ్యావుల తప్పు పట్టారంటున్నారు. ఆ సమాచారం సి.ఎం చంద్రబాబుకు చేరింది. అందుకే పార్టీ కీలక పదవి నుంచి పయ్యావులను తప్పించారంటారు. అదొక్కటే కారణం కాదు. చాలా విషయాల్లో పయ్యావుల తీరు పై వ్యతిరేకత వచ్చిందంటున్నారు. 
తాజాగా ఏమైందంటే…
పరిటాల శ్రీరామ్ పెళ్లికి అనంతపురం వెళ్లారు తెలంగాణ సి.ఎం కేసీఆర్. అదే సమయంలో అక్కడకు వచ్చిన పయ్యావుల కేశవ్ కేసీఆర్ తో మాట్లాడారు. ఎదుటి వ్యక్తి తన కంటే పెద్ద వారు అయినప్పుడు నమస్కారం పెట్టడం సంస్కారం. అదే పనిచేశాడు పయ్యావుల. తన దారిన తాను వెళ్లిపోయారు. అందులో ఎలాంటి తప్పులేదు. కానీ ఆ తర్వాత అసలు గమ్మత్తు జరిగింది. ఓ పోలీస్ అధికారితో పయ్యావులను పిలిపించుకున్నారు కేసీఆర్. అతన్ని పక్కకు పిలిచి మరీ మంతనాలు చేశారు. మీడియాలో ఆ అంశం పెద్ద ఎత్తున ప్రచారానికి నోచుకుంది. అదే ఇబ్బందిని తీసుకువచ్చింది. మేము కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడుతుంటే పయ్యావుల వంటి వారు ఇలా చేస్తారా అంటూ తెలంగాణ టీడీపీ నేతలు రుసరుసలాడారు. వాస్తవంగా వారు చెప్పింది ఒక్క పయ్యావుల విషయంలోనే కాదు.. మిగతా వారు చాలా మంది కేసీఆర్ కు అవసరానికి మించి గౌరవ మర్యాదలు ఇచ్చారనేది వారి వాదన. ఇలా చేస్తే ఇక మేము ఎలా పనిచేయాలని సి.ఎం చంద్రబాబునాయుడు ముందు పంచాయితీ పెట్టారు.
              దీంతో చంద్రబాబు రంగంలోకి దిగారు. పయ్యావుల అలా మాట్లాడటం ఇబ్బందిని తెచ్చిపెడుతుందని చిన్నపాటి హెచ్చరిక చేశారు. అది పయ్యావులను మనస్థాపానికి గురిచేసింది. కేసిఆర్ వచ్చినప్పుడు జరిగిన దానిలో తన తప్పు ఏమి ఉందని ఆయన అంటున్నారు పరిటాల శ్రీరామ్ పెళ్లికి తాను అతిధిగానే వెళ్లాను. కేసీఆర్ కనిపిస్తే, నమస్కారం పెట్టి వెళ్లిపోయాను. ఒక పోలీసు అధికారి ద్వారా తనకు కబురు చేశారు. దాంతో ఆయన వద్దకు వెళ్లానని కేశవ్ వివరించారు. తనంత తాను అక్కడకు వెళ్లలేదని, ఏకాంత భేటీ జరపలేదని, సమాచార లోపం వల్ల ముఖ్యమంత్రి అలా భావించి ఉండవచ్చని వివరణ ఇచ్చారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*