ఏపీ అసెంబ్లీ పై వర్మ వివాదస్పద వ్యాఖ్యలు



Want create site? Find Free WordPress Themes and plugins.
       నిత్యం వివాదాలతో సావాసం చేస్తాడు. అవి లేకపోతే వర్మకు నిద్రపట్టదట. ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తాడు. అంతా తనను తిడుతుంటే ఎంతో ఆనందాన్ని అనుభవిస్తాడు. ఇప్పుడు రాం గోపాల్ వర్మ చూపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై పడింది. అసలు రాష్ట్ర విభజనతో లోటు బడ్జెట్ తో నెట్టుకొస్తోంది చంద్రబాబు ప్రభుత్వం ఇటు ప్రత్యేక హోదా లేక అలాయని గట్టిగా అడిగితే ఇచ్చే కేంద్రం నుంచి నిధులు ఆపుతారనే జాగ్రత్తతో పావులు కదుపుతున్నాడు సి.ఎం చంద్రబాబునాయుడు. ఫలితంగా ఆంధ్రుల నగరి అమరావతి రాజధాని నిర్మాణం, అసెంబ్లీ నిర్మాణాలు మూడు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్న చందంగా మారింది. మరోవైపు పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి బాటలో పెట్టేందుకు చంద్రబాబునాయుడు తన వంతుగా ప్రయత్నిస్తున్నాడు. 
      ఇదిగో ఇలాంటి సమయంలో వర్మ నోరు విప్పాడు. ఇన్నాళ్లు సినీ నటులు, ప్రముఖుల మీద నోరు పారేసుకున్న అతను ఇప్పుడు ఏపీ సర్కారు పై పడ్డారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి అసెంబ్లీని నిర్మించడం ఎందుకు. దండగ అని వర్మ కామెంట్ చేశాడు. అంతే కాదు..ఏపీ ప్రభుత్వానికి గొప్ప సలహానిచ్చాడు వర్మ. అసెంబ్లీ సమావేశాలను గ్రీన్ మ్యాట్ స్క్రీన్ ముందు నిర్వహించాలన్నారు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు రాజమౌళి సహకారంతో గ్రాఫిక్స్ జతచేసి ప్రసారం చేస్తే అద్భుతంగా వుంటుందని సెటైర్ వేశాడు. ఇలా చేస్తే అసెంబ్లీ ప్రపంచంలోని అన్నీ అసెంబ్లీల కంటే గొప్పగా కనిపిస్తుందని చెప్పారు. ఎందుకంటే ఇది ”బాహుబలియన్ అసెంబ్లీ” కాబట్టి అంటూ కామెంట్ చేశాడు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*