అఖిల్ సినిమాలో వెంకటేష్



Want create site? Find Free WordPress Themes and plugins.
        తెలుగు మల్టీ స్టారర్ చిత్రాలు చాలా తక్కువే. అలా నటించే హీరోలు తక్కువేనని చెప్పాలి. విక్టరీ వెంకటేష్ పవన్ కల్యాణ్ తో గోపాల గోపాల, మహేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, సోగ్గాడులో తరుణ్ తో, నాగ చైతన్యతో ప్రేమమ్, రానాతో కృష్టం వందే జగద్గురుమ్ వంటి సినిమాల్లో నటించాడు.  ఇప్పుడు అక్కినేని నట వారసుడు అఖిల్ తో నటించనున్నాడు వెంకటేష్. అఖిల్ తొలి సినిమా నిరాశపరచడంతో నాగార్జున రెండో సినిమాకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
       మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రెండో సినిమా తెరకెక్కుతోంది. హలో పేరుతో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కానుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో అలరించనున్నారట. నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ప్రేమమ్ సినిమాలోను వెంకీ అలానే నటించాడు. ఆ సినిమా ఘనవిజయం సాధించింది. అందుకే సెంటిమెంట్ గా అఖిల్ హలో కోసం అడిగితే కాదనలేదట వెంకటేష్. దీని పై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. హలోలో అఖిల్ పక్కన కల్యాణి ప్రియదర్శన్ నటిస్తుండగా..అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అన్న నాగ చైతన్య, సమంతల వివాహ వేడుక సందర్భంలో వెంకటేష్ హలో సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*