జాతీయ సమైక్యతే దేశానికి పునాదులు – వాసవి క్లబ్ ఇంగ్లాండ్



Want create site? Find Free WordPress Themes and plugins.
          
 
     
        కులం ,మతం పేరుతో దేశం లో అశాంతి కి దారితీసే పరిణామాలను మొదట్లోనే త‌ుంచి వేయాలని , మతం పేరు తో ,కులం పేరుతో దూషణ సరికాదని ఇంగ్లాండ్ లోని వాసవి క్లబ్ పేర్కోంది. లండన్ లో వాసవి క్లబ్ ఇంగ్లాండ్ ఆధ్వర్యం లో నిర్వహించిన సంఘటిత సమ్మేళనం క్లబ్ లీడర్లు మాట్లాడారు. రాజ్యాంగం ద్వారా కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ ఇతరుల మనో భావాలను దెబ్బతీసే విధం గా ఉండరాదని చరిత్రలో మంచిని స్వీకరించి సమాజ శ్రేయస్కర రచనలు చేసి జాతికి ఉపయోగకరంగా ఉండాలి తప్ప, చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనల ను తెర పైకి తెచ్చి ప్రజల్లో గొడవ లు సృష్టించే విధంగా ఉండకూడదన్నారు.

       ప్రొఫసర్ కంచె ఐలయ్య రాసిన పుస్తకం  సమాజం లో  తారతమ్యాలు తెచ్చే విధంగా, కులాల మధ్య చిచ్చు పెట్టి  మానవ సంబంధాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. రచనలు సమాజ  శ్రేయస్కరంగా ఉండాలి తప్ప గొడవలకు ఆస్కారం కారాదు. కంచె ఐలయ్య  యావత్ జాతి కి బేషరతు క్షమాపణ చెప్పి తన పుస్తకాన్ని  విరమించుకోవాలని  డిమాండ్ చేశారు. 

       కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి సంఘ విద్రోహక చర్యలు ఎవరు చేపట్టిన తక్షణమే స్పందించి  చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. కంచె ఐలయ్య పుస్తకాన్ని  నిషేధించాలని  ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ    ప్రభుత్వాలకు లేఖ రాయాలని  వాసవి క్లబ్ ఇంగ్లాండ్  శాఖ  తీర్మానం చేసింది.

       ఈ కార్యక్రమంలో సురేష్ ముర్కీ ,మహేష్ చందా  మోహన్ ,మధు ,కృష్ణ లాలం ,వెంకట  కుమార్ ,రాజేష్ చుండూరి ,నరేష్ మర్యాల ,అంజి కుమార్ ,అరవింద్ శ్రీరామ్ , హేమకుమార్ అమృతలూరు ,బాల దర ,ఓం ప్రకాష్ ,గోపి అగీర్ నిర్మల్ వెచ్చం నాగేంద్ర శ్రీమకుర్తి ,గంప వేణుగోపాల్ ,మహేష్ యంసాని  లతో పాటు అనేక మంది   వివిధ ప్రాంతాల నుండి వాసవి క్లబ్  ఇంగ్లాండ్ సభ్యులు విచ్చేసి  వారి మద్దతు తెలిపారు.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*