అమెరికా అడవుల్లో అగ్ని కీలలు



Want create site? Find Free WordPress Themes and plugins.
అమెరికాలోని కాలిఫోర్నియా అడవుల్లో రేగిన మంటలు అంతకంతకు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే కార్చిచ్చులో 10 మంది చనిపోయారు. అక్టోబర్ 9వ తేదీ ఆదివారం రాత్రి ప్రారంభం అయిన మంటలు వేల ఎకరాల అడవిని కాల్చి బూడద చేసింది. 1500 ఇళ్లు కాలిపోయాయి. ద్రాక్ష తోటలకు కేరాఫ్ అయిన సొనోమా, నప, యూబా ప్రాంతాలకూ మంటలు వ్యాపించాయి. ఒక్క సొనోమాలోనే ఏడుగురు చనిపోయారు. కార్చిచ్చుతో కాలిఫోర్నియా గవర్నర్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కాలిఫోర్నియాలో చెలరేగిన అత్యంత ప్రమాదకర కార్చిచ్చుల్లో ఇదొకటని అధికారులు చెప్పారు.
                       గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో అవి మరింతగా విస్తరిస్తున్నట్టు కాలిఫోర్నియా డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఫారెస్ట్రీ అండ్‌ ఫైర్‌ ప్రొటెక్షన్‌ అధికారులు తెలిపారు. గతంలోను చాలా సార్లు ఇలానే కాలిపోర్నియాలో కార్చిచ్చు రగిలి అడవులు బూడిదగా మారిన సంఘటనలు చాలానే ఉన్నాయి. కానీ ఈ సారి ఏకంగా 14 చోట్ల అలా మంటలు చెలరేగడం ఆశ్చర్యమే. చాలా మంది మంటలను చూసి తప్పనిసరి పరిస్థితుల్లో తమ నివాసాలను ఖాళీ చేసి వెళుతున్నారు. మరోవైపు అమెరికా వైమానిక దళాలు మంటలను ఆర్పే పని ముమ్మరం చేశాయి.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*