పాపం దత్తాత్రేయ



Want create site? Find Free WordPress Themes and plugins.
బండారు దత్తాత్రేయ. ముద్దుగా దత్తన్న అని పిలుస్తారు అభిమానులు. ఆయన పరిస్థితి చూస్తే జాలేస్తోంది. కేంద్ర మంత్రిగా నిన్నటి వరకు ఆయన ఇంటి వద్ద ఒకటే హడావుడి. అసలు ఆయన్ను కలిసేందుకు జనాలు క్యూ కట్టేవాళ్లు. ఇప్పుడు ఆయన్ను పట్టించుకోవడం లేదు. ఇంటి వద్దనే కాదు.. పార్టీ కార్యక్రమాల్లోను ఇంతే తీరు. ఇదంతా ఎందుకు వచ్చిందటే….
                 కేరళలో ఆర్ఎస్ ఎస్ కార్య‌క‌ర్త‌ల‌ు, సీపీఎం నేత‌ల మధ్య దాడుల యుద్దం సాగుతోంది. ఒకసారి వాళ్లు. మరోసారి వీళ్లు దాడులు చేసుకోడం నిత్యకృత్యంగా మారింది. ఫలితంగా బీజేపీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళ‌న‌ల్లో భాగంగా హైద‌రాబాద్ లోని సీపీఎం కార్యాల‌యాన్ని ముట్ట‌డించేందుకు ఇంధిరాపార్క్ నుంచి బీజేపి నేత‌లంతా ర్యాలీగా బయ‌ల్దేరారు. ఈ ర్యాలీలో కేంద్ర‌ మాజీ మంత్రి బండారు ద‌త్తాత్రేయ‌ ఉన్నారు. మంత్రి పదవి ఉన్నప్పుడు అయన ముందు మిగతా వాళ్లు వెనుక ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు అది లేకపోవడంతో సాటి నేతలు, కార్యకర్తలు ఆయన్ను పట్టించుకున్న పాపాన పోలేదు. కేంద్రమంత్రి వర్గంలో లేకముందు అన్ని కార్యక్రమాలకూ సాదాసీదాగా, ఇతర నాయకుల్లాగే పాల్గొనేవారు దత్తాత్రేయ. ఇప్పుడు ఆందోళనలో దత్తన్నను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ర్యాలీలో పాల్గొనేందుకు దత్తన్న వచ్చినా ఆయన్ని చివరన వదిలేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫలితంగా ర్యాలీ ప్రారంభమయ్యాక దత్తన్న వచ్చి మీడియాతో మాట్లాడారు. 
                  మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు సెల్యూట్ చేసిన పోలీసులే ఆయన్ను అరెస్టు చేసి జీపెక్కించారు. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. కాలం అంటే ఇదేనేమో. దత్తాత్రేయ ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీగా సాదాసీదాగా కార్యక్రమానికి హాజరై అరెస్టు కావడం చర్చనీయాంశమైంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*