హరీష్ రావుకు పోటీ వచ్చేశాడోచ్ 



Want create site? Find Free WordPress Themes and plugins.
        జోగుల సంతోష్ కుమార్. తెలంగాణ సి.ఎం కేసీఆర్ కు నమ్మిన బంటు లెక్క. కేసీఆర్ ఏం చెబితే అది చేస్తాడు. మంచి ఏదో. చెడు ఏదో వివరిస్తాడు. తనకు తెలిసిన సంగతులు మోహమాటం లేకుండా చెప్పేస్తాడు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న పొరపచ్చాలను చెప్పడంలో సాటి మేటి అంటారు. అందుకే కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ ను నమ్మినంతగా తన మరదలి కొడుకు సంతోష్ కుమార్ ను నమ్ముతాడు. అందుకే అతన్ని ఇప్పుడు మేనల్లుడు హరీష్ రావుకు పోటీగా తెచ్చాడంటున్నారు. 
        తెరాస ప్రధాన కార్యదర్శిగా సంతోష్ కుమార్ నియామకం వెనుక పెద్ద కసరత్తే సాగింది. ఇప్పటికే పార్టీలో అంతా కేసీఆర్ కుటుంబమే ఉంది. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులు. ఒకరు ముఖ్యమంత్రి. మరో ఇద్దరు మంత్రులు. ఇక కూతురు కవిత నిజామాబాద్ ఎంపీ. వారికి తోడుగా వచ్చాడు సంతోష్ కుమార్. మొత్తంగా పంచ పాండవులు అన్నమాట. ఇప్పటికే నలుగురు చక్రం తిప్పుతుండగా..ఐదో వ్యక్తిగా పార్టీలో అడుగు పెట్టిన సంతోష్ కుమార్ టీ న్యూస్ ఎండీగా ఉన్నాడు. మీడియాలో కేసీఆర్ కు సంబంధించిన వార్తలు ఏమి ఇవ్వాలి. ఏమి ఇవ్వకూడదు వంటివి అతనే నిర్ణయిస్తాడు. 
        ఇన్నాళ్లు తెర వెనుక ఉన్నాడు కాబట్టి పెద్దగా ఎవరికీ తెలియలేదు.  ఇప్పుడు పార్టీలోకి వచ్చాడు. వాస్తవంగా తన తర్వాత కేటీఆర్ ను సి.ఎం కుర్చీమీద కూర్చోపెట్టాలనేది కేసీఆర్ ఆలోచన. అందుకే కేటీఆర్ ను ప్రోత్సహిస్తు మరోవైపు అతని సీటుకు ఎసరు తెచ్చేలా ఉన్న హరీష్ రావును కేసీఆర్ అణగదొక్కుతున్నాడనే చర్చ ఉంది. కానీ ఇప్పుడు హరీష్ రావుకు పోటీగా సంతోష్ కుమార్ ను తేవడంతో హరీష్ రావు ఇక వెనక్కు తగ్గినట్లేనంటున్నారు. 
      రాజకీయాలు ఎప్పుడు ఎలా తిరుగుతాయా చెప్పలేం.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*