భాజపా : తమ ఘనతగా చాటుకునే ఉపాయం!



Want create site? Find Free WordPress Themes and plugins.

ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ మనుగడ కోసం నానా పాట్లు పడుతోంది. చంద్రబాబునాయుడుతో సత్సంబంధాలు కలిగి ఉన్న కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు  ఎటూ పార్టీ విస్తరణ గురించి గానీ, అభివృద్ధి గురించి గానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదనేది చాలా మందిలో ఉన్న అభిప్రాయం. ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చక్కగా పనిచేస్తున్నదంటే.. అందులో తమ పార్టీ పాత్ర కూడా మెండుగా ఉన్నదనే కీర్తిని ఏదో ఒక రీతిగా సంపాదించుకోవడానికి కమలనాధులు వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం త్వరలో తీసుకోదలచుకుంటున్న నిర్ణయాలు ఏమిటో పసిగట్టి, అలాటి నిర్ణయాలు తీసుకోవాలని తాము కోరినట్లుగా తీర్మానాలు చేయడం ద్వారా వారు చిన్న టెక్నిక్కును అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. పార్టీ కార్యవర్గ సమావేశంలో వారు చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరుతూ చేస్తున్న తీర్మానాలు ఆల్రెడీ ఆ ప్రభుత్వం  జీవోలు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్న విషయాలే అని పలువురు అనుకుంటున్నారు.

భాజపా కార్యవర్గ సమావేశం.. గుంటూరులో జరిగింది. ఈ సమావేశంలో చాలా సహజంగా.. రాష్ట్రంలో జరుగుతున్న పనులకు నిధులన్నీ కేంద్రంనుంచి ఇస్తున్నాం అని.. కానీ రాష్ట్రప్రభుత్వానికి మాత్రమే కీర్తి దక్కుతోందని.. కీర్తిలో తమకు వాటా కావాలని వారు ఆక్రోశించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రాష్టప్రభుత్వం పెట్రోలు  డీజిల్ ల మీద పన్నులు తగ్గించాలని కోరుతూ ఒక రాజకీయ తీర్మానం చేశారు. దీనివల్ల ప్రజల మీద పడే భారాన్ని తగ్గించాలని వారు కోరారు.

నిజానికి కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా మన దేశంలో మాత్రం ధరల్లో మార్పులు చేయకుండా.. వినియోగదారుల నడ్డి విరుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయంలో మోడీ సర్కారు తీరు మీద వాహనదారుల్లో చాలా అక్కసే ఉంది. కాగా, కేంద్రం ఇటీవల కాస్త తగ్గించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ… ఏపీ ప్రభుత్వం పన్నులు తగ్గించాలని భాజపా కోరింది.

నిజానికి ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం అదే పనిలో ఉంది. ఏపీలో వేర్వేరు పన్నుల కారణంగా ఇటు పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోలిస్తే లీటరు మీద నాలుగు రూపాయల వంతున ధరలు ఎక్కువగానే ఉన్నాయి. దీనివల్ల రాష్ట్ర సరిహద్దు పెట్రోలు బంకుల్లో అసలు బిజినెస్ లేకుండా పోతోంది. బంకు యజమానులనుంచి అభ్యంతరాలు రావడంతో.. ఆ వ్యత్యాసం లేకుండా పోయేలా పన్నులు తగ్గించడానికి ఏపీ సిద్ధమవుతున్నట్లుగా కొన్నిరోజులుగా పత్రికల్లో వార్తలు కూడా వస్తున్నాయి. ఎటూ ప్రభుత్వం చేయబోయే ముందు, తాము అడిగినట్లుగా బిల్డప్ ఇస్తున్నారు భాజపా నేతలు. రేపు నిర్ణయం వచ్చిందంటే.. ఆ పన్ను తగ్గింపును తామే సాధించినట్లు చాటుకోవడం వారి లక్ష్యంలాగా కనిపిస్తోంది మరి!

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*