అమెరికాను అతలాకుతలం చేస్తున్న హరికేన్లు 



Want create site? Find Free WordPress Themes and plugins.
అమెరికాకు ముసురు పట్టింది. ఈ మధ్య అది కాస్త పెద్దగా మారి హరికేన్ అవతారమెత్తుతోంది. ఒకటి పోయిందనుకుంటే మరొకటి వస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే హార్వే, ఇర్మా హరికేన్ల దెబ్బతో అమెరికా అతలాకుతలం అయింది. వాటి నుంచి కోలుకోకముందే నేట్‌ హరికేన్‌ అమెరికాలో ఇప్పుడు అల్లకల్లోలం చేస్తోంది. బిలోక్సీ, మిసిసిపీ ప్రాంతాల్లో తీరం దాటిన నేట్ హరికేన్ వల్ల అక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్థమైంది. అలబామా, ఫ్లోరిడా, లూసియానా, మిసిసిపీ ప్రాంతాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. అందుకే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. లూసియానా, మిసిసిపీ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారి కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటయ్యాయి. హరికేన్ ప్రభావంపై మిసిసిప్పీ గవర్నర్ ఫిల్ బ్రయాంట్‌తో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంప్రదించారు. 
            2005లో వచ్చిన కత్రినా తుఫాను మిసిసిప్పీలో బీభత్సం సృష్టించింది. ఇప్పుడు నేట్ తుఫాను దాన్ని మించి పోయేలా ఉందని ప్రజలు భయపడుతున్నారు. సుమారు 67వేల గృహాలు విద్యుత్ లేక చీకటిలో మగ్గుతున్నాయి. ఉత్తర జార్జియా, అలబామా, ఫ్లోరిడా పన్‌హాండ్లే ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. ఫలితంగా ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*