తెలంగాణ నేతల భేటీలో చంద్రబాబు కీలక నిర్ణయాలు



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలంగాణ టీడీపీ నేతలతో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి భేటీ కానున్నారు. తెలంగాణలో పార్టీ పొత్తులు, ఎత్తులపై వారితో మాట్లాడనున్నారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన కీలక సమావేశంలో నేతలు పలు సందేహాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అందుకే వారి అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు.. పార్టీ పటిష్టం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రస్తావించనున్నారు. 
                      రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులతో పాటు.. నామా నాగేశ్వరరావు, ఉమా మాధవ్ రెడ్డిలు తలో మాట మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. తన సీటు ఉందా లేదా అని ఉమా మాధవరెడ్డి అడగడం కాస్తం ఆశ్చర్యమే. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకు రేవంత్ రెడ్డి పావులు కదుపుతుంటే.. టీఆర్ఎస్ తో కలిసి వెళ్లేందుకు సిద్దమని మోత్కుపల్లి వంటి నేతలు చెబుతున్నారు. దీంతో వారందరితో చంద్రబాబు సమావేశమై ఎవరూ పొత్తులపై మాట్లాడవద్దని చెప్పారు. ఇప్పుడు వారితోనే మాట్లాడి పొత్తుల సంగతి ప్రస్తావించనున్నారు చంద్రబాబు. 
             అవసరమైతే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగేందుకు టీ టీడీపీ సిద్ధమవుతోందనే సంకేతాలు అందుతున్నాయి. వీలుంటే గులాబీతో కాదంటే… ఒంటరి పోరు చేసేందుకు సిద్దమవుతుంటున్నారు. 2024 నాటి కల్లా గత వైభవం వచ్చేలా టీడీపీని బలోపేతం చేసేందుకు చంద్రబాబునాయుడు సిద్దమవుతున్నారంటున్నారు. నేతలు పార్టీని వీడినా క్యాడర్ లో టీడీపీ అంటే అభిమానం బాగా ఉందని చంద్రబాబు చేయించిన సర్వేలో తేలిందట. అందుకే టీడీపీ బలోపేతంపై ఆయన దృష్టి పెట్టారంటున్నారు. 2019 ఎన్నికల్లో తాము ఒంటరి పోరుకు సిద్ధమని చెబుతున్నారు మరోవైపు ఎల్ రమణ వంటి నేతలు. 
               గతంలో బీజేపీతో కలిసి వెళ్లిన టీడీపీకి లాభం కంటే నష్టం ఎక్కువ జరిగిందనేది తెలుగు తమ్ముళ్ల మాట. అందుకే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి దూరంగా వెళ్లాలనే ఆలోచన చేస్తోంది. మరోవైపు కమలం పార్టీ అదే మాట చెబుతోంది. ఏపీలో పరిస్థితి ఇందుకు భిన్నం. అక్కడ కలిసి పోటీ చేసేందుకు ఆ రెండు పార్టీలు సిద్దమవుతున్నాయి. బీజేపీ ఎందుకు ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటిస్తుందో తమకు తెలియదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో జరిగే భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*