చంద్రబాబు విదేశీ పర్యటన ఇలా సాగుతుంది



Want create site? Find Free WordPress Themes and plugins.
చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళుతున్న సంగతి తెలిసిందే. కాకపోతే అధికారికంగా ఆ సంగతి ప్రకటించారు. ఈనెల 17 నుంచి 26 వరకు మొత్తం 9 రోజుల పాటు సి.ఎం చంద్రబాబునాయుడు వివిధ దేశాలను చుట్టిరానున్నారు. రాష్ట్రాభివృద్దికి పెట్టుబడుల ఆకర్షణ, రాజధాని నిర్మాణాల ఆకృతులకు తుదిరూపు తేవడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. ఈ నెల 18 నుంచి 21 వరకు అమెరికాలో పర్యటించి పెట్టుబడిదారులు, ప్రవాసాంధ్రులను కలవనున్నారు. గతంలో అమెరికా వెళ్లిన సమయంలో అక్కడి వాణిజ్య వేత్తలు, వివిధ కంపెనీ సీఈఓలతో చంద్రబాబు మాట్లాడిన సంగతి తెలిసిందే. వారిలో కొంత మంది అమరావతి రాజధానికి వచ్చి మరీ వాస్తవ పరిస్థితులను తెలుసుకుని వెళ్లారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఇప్పుడు మరోసారి అక్కడకు వెళతున్న నేపధ్యంలో కీలక భేటీలు జరగనున్నాయి. 
                  అమెరికా పర్యటన ముగిసిన వెంటనే చంద్రబాబు ఈనెల  22,23 తేదీల్లో దుబాయ్‌లో జరిగే పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొంటారు. ఆంధ్రుల నగరి అమరావతి రాజధానిలో నిర్మించే ఐకానిక్‌ భవనాల నిర్మాణ డిజైన్లను పరిశీలిస్తారు. దానికి సంబంధించి తుది నిర్ణయం తీసుకునేందుకు లండన్‌ వెళ్తారు. అమెరికా టూర్‌ ముగించుకుని.. చంద్రబాబు అరబ్‌ దేశాల్లో పర్యటించనుండంతో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అక్కడ ప్రవాసాంధ్రులతోను భేటీ కానున్నారు. యూఏఈలోని పలువురు వాణిజ్యవేత్తలు, సంస్థల ప్రతినిధులు, ఆయా దేశాల అధినేతలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత లండన్‌ పర్యటనకు సి.ఎం చంద్రబాబునాయుడుతో పాటు… పురపాలకశాఖ మంత్రి నారాయణ, సీఆర్డీఏ ఉన్నతాధికారులు, ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి కూడా వెళ్తున్నారని తెలుస్తోంది. విదేశీ పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు తిరిగి ఈ నెల 27న ఏపీకి రానున్నారు. గతం కంటే ఉత్సాహంగా వెళుతున్న చంద్రబాబు బృందం ఎన్నో ఒప్పందాలు చేసుకుని, మరెన్నో హామీలతో తిరిగి రానుండం విశేషం.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*