మరో వరల్డ్ కప్ ఆడతాను..మిధాలీరాజ్



Want create site? Find Free WordPress Themes and plugins.
          2021లో జరిగే వరల్డ్ కప్‌లో ఆడతానని భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ స్పష్టం చేసింది. 15 ఏళ్లకు పైగా అంతర్జాతీయ క్రికెట్‌‌లో రాణిస్తున్న మిథాలీ రాజ్ ఐదు వరల్డ్ కప్‌లు ఆడింది. ఆ ఘనత సాధించిన క్రికెటర్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఆరువేల పరుగులుచేసిన తొలి మహిళా క్రికెటర్ గా రికార్డు సృష్టించింది మిథాలీ రాజ్. మరో నాలుగేళ్లలో జరగనున్న వరల్డ్ కప్‌లో వయసు రీత్యా మిథాలీ రాజ్ ఆడకపోవచ్చనే అనుమానాలు వచ్చాయి. కానీ మిథాలీ మాత్రం తనకు ఇప్పుడే రిటైరయ్యే ఆలోచనేమీ లేదని చెప్పింది. 
      ఐసీసీ వన్డే ఛాంపియన్‌షిప్‌లో భాగంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మిథాలీ సేన దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ప్రపంచకప్‌లో నేను ఆడే అవకాశాల్ని కొట్టిపారేయలేను. నాలుగేళ్ల తర్వాత ప్రపంచకప్‌ ఆడాలంటే ముందు ఈ మూడేళ్లూ ఎలా కెరీర్‌ను కొనసాగించాలో ఆలోచిస్తానని చెప్పిందామె. తొలి వన్డేలో ఐర్లాండ్  పై 114 పరుగులు సాధించి నాటౌట్ గా నిలవడంతో అందరి దృష్టి మిధాలీ పై పడింది. 2001-02 లో మొదటి టెస్ట్ మ్యాచ్ లక్నోలో ఆడిన మిథాలీ ఇంగ్లాండ్ పై టాంటన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్ లో 214 పరుగులు సాధించి మహిళా క్రికెట్ లో ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. 
         వరుసగా ఏడు అర్థ సెంచరీలు చేసిన ఘనత మిథాలీ రాజ్ పేరు మీదే ఉంది. మరో మహిళా క్రికెటర్ ఎవరూ ఈ ఘనత సాధించలేదు. వరల్డ్ కప్ లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి ఇండియన్ మహిళా క్రికెటర్ ఆమెనే. ఇన్ని ఘనతలు సాధించిన మిథాలీ ఈ సారన్నా..కప్ ను భారత్ కు తీసుకువస్తే అంతే చాలు. ఆటకోసం పెళ్లిని వాయిదా వేసుకుంటూ వస్తున్న మిధాలీ ఇప్పుడు అబ్బాయి కోసం చూస్తున్నట్లు చెప్పేసింది. మరి ఆ కలల రాకుమారుడు ఎక్కడున్నాడో. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*