చంద్రబాబు ఇంటికి…. తలసాని ఎందుకు వచ్చారు…..?



Want create site? Find Free WordPress Themes and plugins.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇంటి వద్దకు వచ్చారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. మంత్రి కాన్వాయ్ హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటి ముందుకు వచ్చే సమయానికి మీడియా ప్రతినిధులంతా అక్కడే ఉన్నారు. ఇదేంటి.. మంత్రి తలసాని చంద్రబాబు ఇంటి వద్దకు వచ్చారని ఆరా తీశారు. వారిని చూసి బిత్తరపోవడం తలసాని వంతు అయింది. అంతలోనే సర్దుకున్నారు. అరే.. ఇటు వచ్చానా… కంగారులో రూటు మార్చినట్లున్నా.. అటు నేను వెళ్లాల్సిందని చెప్పి మరీ అక్కడ నుంచి జారుకున్నాడు. మీడియా ప్రతినిధులు లేకపోతే చంద్రబాబు వద్దకు వెళ్లి కలిసి వచ్చేవాడు తలసాని. కానీ అంతా ఉండటంతో చేసేది లేక చంద్రబాబును కలవకుండానే వెనక్కు వెళ్లాడు మంత్రి. 
                 తలసాని అక్కడకు వచ్చినప్పుడు సి.ఎం చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో లోపల మాట్లాడుతున్నారు. తెలంగాణలో పార్టీని ఎలా అభివృద్ధి చేయాలో చర్చిస్తున్నారు. ఆ సంగతి తలసానికి తెలియలేదు. అందుకే వచ్చారంటున్నారు. అందులోను ఆదివారం మీడియా ప్రతినిధులు ఉండరని అనుకున్నారు. కానీ మీడియా అంతా అక్కడే ఉండేసరికి చల్లగా జారుకున్నారు. రాబోయే కాలంలో టీఆర్ఎస్, టీడీపీలు పొత్తు పెట్టుకునే ఆలోచన చేస్తున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకు బలం చేకూర్చేలా గులాబీ నేతలు చంద్రబాబుతో మంతనాలు చేస్తున్నారంటున్నారు.
                తలసాని ఎక్కడకు వెళ్లాలి. ఎవరిని కలవాలనే విషయంపై పోలీసులకు ముందే పక్కా సమాచారం ఉంది. చంద్రబాబు నివాసం వద్దకు తలసాని వెళుతున్నారు. రక్షణ కల్పించాలనేది వారికి వచ్చిన ఆదేశాలు. అందుకే ఆయనతో పాటు.. అంతా వచ్చారు. తీరా అది లీక్ అయ్యే అవకాశం ఉండటంతోనే వెనక్కు వెళ్లారంటున్నారు.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*