అమెరికాలో ఘనంగా టాటా దసారా సంబరాలు Want create site? Find Free WordPress Themes and plugins.
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) చేస్తున్న కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. దసరా సందర్భంగా ఉత్తర అమెరికా, గ్రేటర్ ఫిలడెల్ఫియా, పెన్సూలినియాలో నిర్వహించిన ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేశాయి. భవిష్యత్ తరాలకు వాటి ఆవశ్యతకను తెలియచెప్పాయి. 
           ఫిలడెల్ఫియా, పెన్సూలినియాలో జరిగిన వేడుకలకు వెయ్యి మందికి పైగా హాజరై సంబరాలు జరుపుకున్నారు. న్యూజెర్సీ, న్యూయార్క్, మేరి లాండ్, డెలావేర్ వంటి ప్రాంతాల నుంచి తెలుగు వారు ఈ సంబరాలకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయవంతం చేశారు. వారిలో వంద మంది వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని అలరించారు. డాన్స్ షోలు, పాటలు, ఆటలు, తెలంగాణ జానపద నృత్యాలు, గీతాలతో సందడి చేశారు. బిక్షునాయక్ వారిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి.. ఆహుతులను సంతోషపరిచారు. 
       పెన్సూలినియా సెనేటర్ ఆండ్రూ దిన్నిమన్ ప్రత్యేక అతిథిగా వచ్చి ఈ సంబరాలను తిలకించడం విశేషం. టాటా అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనగా… అర్జున్ రెడ్డి సినిమా ప్రొడ్యూసర్ వంగా ప్రణయ్ రెడ్డి గౌరవ అతిథిగా విచ్చేశారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న టాటా ఎగ్జిక్యూటివ్ సభ్యులు, సీనియర్ నేతలు, స్థానిక, జాతీయ నేతలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారిలో ఉన్నారు. 
          సెనేటర్ ఆండ్రూ దిన్నిమన్ అక్కడకు విచ్చేసిన వారిని ఉద్దేశించి మాట్లాడారు. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు చెప్పారు. భారతీయులు ఇక్కడ ఎలా అభివృద్ధి చెందుతున్నారనే విషయాన్ని వివరించారు. పాఠశాల స్థాయి నుంచే భారతీయుల సంస్కృతి, సంప్రదాయాలపై పిల్లలను తీర్చిదిద్దుతున్న తీరును ఆయన మెచ్చుకున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవాలని ఉందనే ఆకాంక్షను వెలిబుచ్చారు సెనేటర్.
               అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో బతుకమ్మ, దసరా వేడుకలను ఎలా జరుపుకున్నారో ఈ సందర్భంగా వివరించారు టాటా అధ్యక్షురాలు ఝూన్సీరెడ్డి. ఇంత పెద్ద ఈవెంట్ ను ఏర్పాటు చేసిన గ్రేటర్ ఫిలడెల్ఫియా యూనిట్ కు అభినందనలు తెలిపారు. ఎడ్వైజరీ కౌన్సిల్ చైర్ డాక్టర్ పైలా మల్లారెడ్డి ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్పడమే కాదు.. గ్రేటర్ ఫిలడెల్ఫియా టీమ్ ను పొగడ్తల్లో ముంచెత్తారు. 
                తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేస్తూ వివిధ స్టాల్స్ ను అక్కడ ఏర్పాటు చేయడం బాగుంది. టాటా బోర్డు డైరెక్టర్ సురేష్ వెంకన్నగిరి, రీజినల్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ కూనవరపు, రమణ కొత్త, భాస్కర్ పిన్నా, వేణు ఏనుగుల, రీజనల్ కో-ఆర్డినేటర్లు వంశీ గుళ్లపల్లి, శశి కశిర, అమర్ వేముల, ఆది పి, కిరణ్ గూడూరు, శ్రీనివాస్ కె., కవిత తాటికొండ, జనార్దన్ బద్దం, సతీశ్ సునకనపల్లి, స్వామి బి. వేణు బత్తిని, శివారెడ్డి, నిశీల్, రాజేష్ ఆలేటి, సత్య ముదిరెడ్డి, నాగార్జున తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.2 Comments

Leave a Reply

Your email address will not be published.


*