పొత్తుపై మాట్లాడవద్దన్న చంద్రబాబు



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటామనే విషయంపై నేతలెవరు మాట్లాడవద్దని ఆదేశించారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. పొత్తులో భాగంగా తమ సీట్లు పోతే ఇబ్బంది అని ఉమా మాధవరెడ్డిలాంటి వాళ్లు చంద్రబాబును ఆయన నివాసంలో జరిగిన సమావేశంలో అడిగారు. ఆ విషయం పక్కన పెట్టండి. ఎన్నికల సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.. ఏంటనేది ఆలోచించి తీసుకుందాం. ఇప్పుడే నేతలు ఎవరికి వారు పొత్తులు ఆపార్టీతో ఉంటాయి.. ఈ పార్టీతో ఉంటాయని చెప్పవద్దన్నారు. ఫలితంగా టీడీపీ నేతల నోళ్లు మూతపడే వీలుంది.
            తిరుమలలో కనీసం తమను పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి లాంటి వాళ్లు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. తమ కంటే టీఆర్ఎస్ నేతలకే అక్కడ ప్రాధాన్యత బాగా ఇస్తున్నారని చెప్పారు రేవూరి. పరిటాల ఇంట జరిగిన పెళ్లి నాడు మీరు ఒంటరిగా ఉన్నారు. ఏపీ మంత్రులంతా తెలంగాణ సి.ఎం కేసీఆర్ చుట్టూరా ఉన్నారు. అక్కడ కేసీఆర్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారని నామా నాగేశ్వరరావు వంటి నేతలు ప్రస్తావించారట.
           మేము టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాడుతుంటే.. మంత్రి దేవినేని ఉమా వంటి వారు కేసీఆర్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఇదేం బాగోలేదని రేవంత్ రెడ్డి లాంటి వారు గట్టిగానే మాట్లాడినట్లు తెలుస్తోంది. వాడెవడు, వీడెవడు అంటూ గతంలో దేవినేనికి వ్యతిరేకంగా మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు అదే మంత్రి కోసం పరితపిస్తున్నారని చెప్పారు. తెరవెనుక జరిగే మంతనాల వల్ల తెలంగాణలో టీడీపీ నష్టపోతుందని ప్రస్తావించారట. మొత్తం విషయాలను విన్న చంద్రబాబు తెలంగాణలో టీడీపీ బలోపేతం దృష్టి పెట్టాలని చెప్పినట్లు తెలుస్తోంది. చిన్న చిన్న విషయాలను పక్కన పెట్టండి. పార్టీని ప్రజల్లోకి తీసుకెళితే.. అంతా సానుకూలంగా ఉంటుందని చెప్పారట చంద్రబాబు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*