కేసీఆర్ పై సోషల్ మీడియాలో వస్తున్న సెటైర్లుWant create site? Find Free WordPress Themes and plugins.
        తెలంగాణ సిఎం కేసీఆర్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర కథనాలు చాలానే వస్తున్నాయి. అందులో కొన్ని పూర్తి విమర్శనాత్మకంగా ఉంటే..ఇంకొన్ని ఆయన ఇచ్చిన హామీలు, ఆచరణ రూపం ఎంత వరకు దాల్చాయో వివరిస్తున్నాయి.  ఫలితంగా కేసీఆర్ మరోసారి హాట్ టాపికయ్యారు. తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ విపక్షాలు పోరు బాట పట్టాయి. సి.ఎం తీసుకునే నిర్ణయాలను అందరూ స్వాగతించాల్సిన పని లేదు. కాళేశ్వరం, మల్లన్న సాగర్ పనులకు విపక్షాలు అడ్డు తగులుతున్నాయి ఆరోపించారు కేసీఆర్. ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని భావిస్తే కోర్టులకు వెళ్లడంలో తప్పు లేదు. 
          గతంలో ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిలకు వ్యతిరేకంగా కోర్టులకు వెళ్లిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఆ కేసులో ఏది న్యాయం అనిపిస్తే అలా తీర్పునిస్తాయి న్యాయస్థానాలు. అసలు కోర్టులకు వెళ్లడమే తప్పు అనేలా సిఎం కేసీఆర్ మాట్లాడటం ఆసక్తికరమే. తెరాసను ప్రత్యక్షంగా వ్యతిరేకించిన వారూ, పరోక్షంగా తప్పు పట్టేవాళ్లు చాలా మందే. అది ప్రజలకు ఉండే ప్రజాస్వామిక హక్కు. ప్రతిపక్షాలపైన దాడి చేసే హక్కు అధికారపక్ష నాయకులకు ఉన్నప్పుడు అధికారంపక్షంపైన దాడి చేసే హక్కు ప్రతిపక్షాలకూ ఉంటుంది. కానీ నేతల పై వ్యక్తిగత విమర్శలకు దిగడం ఏపార్టీ చేసినా అది మంచిది కాదనే వాదనుంది. 
ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో తిరుగుతున్న ఓ కథనాన్ని చూద్దాం…
తెలంగాణ ఉద్యమ చుక్కాని కోదండరామ్‌ అన్నావ్…ఇప్పుడు వాడెవడు, వీడెవడు, తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకి అంటున్నావు
దళితుడ్ని సి.ఎం చేస్తానన్నావు…ఆ పని చేయలేక పోయావ్..
తుమ్మల, తలసానిలు తెలంగాణ ద్రోహులన్నావ్…వారిని పిలిచి మంత్రి పదవులిచ్చావు…
తెలంగాణ వస్తే రాజకీయాలు లేవన్నావ్..ఏమైంది..ఏం కాలే..
టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అన్నావ్…రాజకీయ పార్టీగా మార్చావ్..ఏమైంది..ఏం కాలే
ఆంద్రా వాళ్లు దొంగలన్నావ్, వారికీ కాంట్రాక్టులిస్తున్నావ్…
కాంగ్రెస్ వాళ్ల వల్లనే తెలంగాణ వచ్చిందన్నావ్..ఇప్పుడు కాదంటున్నావ్ 
బీజేపీ మద్దతు ఇచ్చిందని పొగిడావు..చిన్నమ్మ (సుష్మాస్వరాజ్)కు కితాబునిచ్చావు..ఇప్పుడు అదే పార్టీని తిడుతున్నవ్..ఏమైంది..
జానారెడ్డిలాంటి నేతలు మాకు ఆదర్శం అన్నావ్..ఇప్పుడు అది నిజం కాదంటున్నావ్
కుటుంబ సభ్యులకు పదవులు వద్దన్నావ్…నీతో పాటు…కేటీఆర్, కవిత, హరీష్ రావులకు పదవులు ఇచ్చావ్
సమగ్ర కుటుంబ సర్వే అన్నావ్, ఏమైందో చెప్పలే…
హుస్సేన్ సాగర్ శుద్ది అన్నావ్..పక్కన పెట్టావ్
హుస్సేన్ సాగర్ చుట్టూ వంద అంతస్తుల భవనాలు కట్టించి పేదలకు ఇస్తాను అన్నావ్, ఏం అయింది ? ఏం కాలే
మీడియా ప్రతినిధులకు ఇళ్ల స్థలాలు,ఇళ్లు అన్నావ్..ఏం అయింది..ఏం కాలే..
అసెంబ్లీ భవనం కూల్చి కొత్త భవనం కట్టుడు అన్నావ్, ఎం అయింది ?ఏం కాలే !
ఎన్ టీ ఆర్ స్టేడియంలో ప్రపంచ స్థాయి తెలంగాణా కళా భవన్ అన్నావ్, ఎం అయింది ? ఎం కాలే !
ఉస్మానియా ఆసుపత్రి కూల్చి అద్భుతమైన ఆసుపత్రి కట్టిస్తనన్నావ్, ఏం అయింది ? ఏం కాలే !
హైదరాబాదు కి ఉత్తరంగా మరో అంతర్జాతీయ విమానాశ్రయం అన్నావ్, ఏం అయింది ? ఏం కాలే !
హైదరాబాదు విశ్వనగరం అన్నావ్, ఏం అయింది ?
తాగడానికి నీళ్ళు లేవు, నడవడానికి రోడ్లు లేవు, ఇళ్లలోకి, అపార్ట్ మెంటు లలోకి వర్షపు నీళ్ళు వరదలై వస్తన్నాయి, రోడ్ల మీద కార్లు మునుగుతున్నాయి, మాన్ హోల్ లో పడి నాలాల్లో పడి మనుషులు చస్తున్నారు.
హైదరాబాద్ లో మరో ఫిల్మ్ సిటీ అన్నావ్..ఏం అయింది..ఏం కాలే…
రామోజీ ఫిలిం సిటీని నాగళ్లతో దున్నుతానన్నావ్..అదేం కాలే…
కేజీ టూ పీజీ ఉచిత విద్య అన్నావ్, ఉన్నోడికి లేనోడికి ఒకటే బడి చదువు అన్నావ్ ఏం అయింది ? ఏం కాలే !
ఓటుకు నోటు కేసుల బ్రహ్మ దేవుడు వచ్చినా కాపాడలేడు అన్నావ్, చివరకు ఏం అయ్యింది ? ఏం కాలే ! 
నయీం కేసుల ఎవ్వరు ఉన్నా వదిలేది లేదన్నావ్. ఎం అయ్యింది ? ఏం కాలే…అందులో ఉన్న పోలీసు అధికారులు, అధికార ప్రతినిధుల పై ఏం చర్య తీసుకున్నారో తెలీదాయె…
ప్రభుత్వ స్కూలు బంగ్లాల లెక్క కట్టించుత అన్నావ్, ఏం అయినై ? ఏం కాలే !
కులాని, మతానికి, వృత్తికి హైదరాబాదులో ఒక పది ఎకరాలు, బంగ్లా, కోట్ల రూపాయిలు ఇచ్చి పైసలు ఇస్తానన్నావ్..ఏమైనయ్….
మియాపూర్ భూ స్కాం ఏం అయ్యింది , ఏం కాలే ! అందులో ఉన్న దొంగలు అందరూ నీ చుట్టూనే ఉండే !
సిటీలో సినిమావాళ్ల మీద డ్రగ్స్ కేసు అయ్యింది, అసలోళ్ల పేర్లు ఎందుకు బయటకు రాలేదు…డ్రగ్స్ కేసు ఏం అయ్యింది ? ఏం కాలే !
పేదలకు మూడు ఎకరాల భూమి పంచుడు అన్నావ్, ఏం అయ్యింది ? ఏం కాలె !
పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు పంచుడు అన్నావ్, ఏం అయ్యింది ? ఏం కాలే !.
దుబాయ్ కి బోయినోళ్ళు బతుకులు మారుడు అన్నావ్, ఏం అయ్యింది ? ఏం కాలే !
నువ్వు అప్పుడప్పుడు నువ్వు వఛ్చిపోవడానికి ఉండడానికి వంద కోట్లతో ప్రగతి భవన్ అయిపోయింది, నీ కార్ల కోసం మరో వందల కోట్లు అయిపోయే !
బతుకమ్మ పండక్కి చీరెలు పంచుడు అన్నావ్..ఇచ్చావ్…కట్టుకోడానికి పనికి రావని…ఆడపడుచులు ఏం చేసిన్న్రో ఎరుకేనా…
లక్ష ఉద్యోగాలు…..25,000 పోలీసు ఉద్యోగాలు ఇయ్యల , వచ్చె యాడాది 50,000 అన్నావ్. ఏమైంది..ఏం కాలె…
నిరుద్యోగ తెలంగాణ యువతతో పేదలతో పరాశకాలు ఆడుతున్నవ్, 
అవినీతికి వ్యతిరేకం అన్నావ్…డబ్బులు ఇవ్వందే ఏ పని కాకున్నా..మౌనంగా ఉన్నావ్..ఏమైంది..ఏం కాలె
కోదండరాం ఎవడు, ఆడేవ్వడు, ఈడేవ్వడు, లంగాలు లత్కోరులు అంటున్నావు జాగ్రత్త సారు…..
ప్రస్తుతం ఈ కథనం తెలంగాణ ప్రజలను ఆలోచనకు గురి చేస్తోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*