కేసీఆర్ తాగుబోతులా మాట్లాడుతున్నారా 



Want create site? Find Free WordPress Themes and plugins.
        సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచినా అంత సంతోషం గా లేదు. ఓడిన, గెలిచిన వారికి మధ్య ఓట్ల తేడా 4 వేలు మాత్రమే. అంతే కాదు… టీఆర్ఎస్ బలంగా ఉన్న భూపాలపల్లి, మందమర్రి వంటి చోట్ల విపక్షాలు గెలిచాయి. అందుకే సిఎల్పీ నేత జానారెడ్డి నుంచి కోదండరామ్ వరకు చాలా మందిని తిట్టిపోశారు కేసీఆర్. వయసు మీద పడిందేమో అందుకే ఇలా మాట్లాడుతున్నారని అంతా అనుకున్నారు. జానారెడ్డి కాస్తంత ఘాటుగానే కేసీఆర్ కు కౌంటరిచ్చారు. నా అనుభవం అంత లేదు. నీ రాజకీయ జీవితం అంటూ గట్టిగానే మాట్లాడారు. మరోవైపు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అయితే మరింత గట్టిగా కేసీఆర్ కు హెచ్చరికలు పంపారు. 
       తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏకి ప‌డేశారు. కేసీఆర్ మందేసి తాగుబోతు మాట‌లు మాట్లాడుతున్నావా ? అంటూ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్ర‌జ‌లు అధికారం అప్ప‌గించిన వెంట‌నే కేసీఆర్ అంతా తానే స‌ర్వ‌శ్వం అనుకునేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ధ్వజమెత్తారు.  ప్రొఫెసర్ కోదండరామ్‌ను వాడు, వీడు అని సంబోధిస్తూ కేసీఆర్ మాట్లాడడం సబబు కాదన్నారు. సింగ‌రేణిలో ప్ర‌తిప‌క్షాల అనైక్య‌త వ‌ల్లే టీఆర్ఎస్ గెలిచింద‌ని, ప్ర‌తిప‌క్షాలు అన్ని క‌లిస్తే టీఆర్ఎస్ గెలిచేదే కాద‌ని ఆయ‌న అన్నారు. తాగుబోతు అయినా తల్లిని తల్లి, చెల్లిని చెల్లి అంటాడని, కానీ నువ్వు మాత్రం అలా కాదని కేసీఆర్ పై మండిపడ్డారు. తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ తెలంగాణ వీరులు, కోదండరాం దేశద్రోహా..ఇదేనా మీరు చేసే పని అని ప్రశ్నించారు. 
         బీజేపీ లేక‌పోతే వెయ్యి మంది కేసీఆర్‌లు ఉన్నా తెలంగాణ వ‌చ్చేది కాద‌ని మండిప‌డ్డారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో కులాలను తీసుకురావడం కేసీఆర్‌కు తగదని చెప్పారు. 1200 మంది బలిదానాలను కేసీఆర్ తక్కువ చేసి చూపుతున్నారని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేసీఆర్ త‌న కూతురు కవిత కోసమే ఇదంతా చేస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. గత ఎన్నికల్లో శ్రీకాంతాచారి తల్లిని ఓడించింది కేసీఆరేనని వీహెచ్ తన వాణి వినిపించారు. కోదండరాంపై ఇంత దిగజారి మాట్లాడడం పద్దతి కాదని హెచ్చరించారు వీహెచ్. 
     ఇలా మూకుమ్మడిగా కేసీఆర్ పై విపక్షాలు విరుచుకుపడటం ఆశ్చర్యమే. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*