ఏపీకి వచ్చే ఉపాధి నిధులను అడ్డుకున్న వైకాపా



Want create site? Find Free WordPress Themes and plugins.
        ఆంధ్రప్రదేశ్ లో ఉపాధి హామీపథకం పనులకు అడ్డంకి ఏర్పడింది. వైకాపా ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డిలు కేంద్రానికి లేఖ రాయడం ఇందుకు కారణం. ఉపాధి హామీ పథకం పనులు పక్క దారిపడుతున్నాయి. కూలీలతో జరగాల్సిన పనులు పొక్లైయిన్లతో జరుగుతున్నాయి. మరోపనికి నిధులను వినియోగిస్తున్నారు. అందుకే అసలు ఏపీకి నిధులు ఇవ్వవద్దని వాళ్లు లేఖ రాశారు. ఫలితంగా కేంద్రం ఏపీకి నిధులు ఇవ్వడం ఆపేసింది. అసలు ఎందుకు ఇలా జరిగిందా అని ఆరా తీస్తే రహస్యం బయట పడింది.
 
       వైసీపీ ఎంపీలు లేఖలు రాయడం వల్లనే ఆపామని..పనులు పద్దతిగా జరగడం లేదని చెబుతుంది కేంద్రం. అలా ఏం లేదు. కావాలంటే వచ్చిచూసుకోవచ్చు. పేద కూలీలకు ఉపాధి కల్పిస్తున్నామని ఏపీ ప్రభుత్వం మరో లేఖను కేంద్రానికి ఇచ్చింది. అసలు ఇలా ఎందుకు చేశారంటే మాత్రం..అది పార్టీ నిర్ణయం. లేఖలు రాశామని చెబుతున్నారు వైకాపా నేతలు. రాష్ట్రానికి నిధులు రాకపోతే ఆ మేరకు కూలీలు నష్టపోతారు గదా అంటే..సమాధానం లేదంటున్నారు. 
       వలసలను నిరోధించేందుకు కూలీ పనులు చేయిస్తున్నాం. మట్టి పనులు చాలా ముమ్మరంగా సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఉపాధి పనుల నిధులను ఆపవద్దని చంద్రబాబు సర్కారు కేంద్రానికి విన్నవించింది. ఇప్పుడు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.   
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*