అక్టోబ‌ర్‌లో విడుద‌లకానున్న `హేయ్‌..పిల్ల‌గాడ`



Want create site? Find Free WordPress Themes and plugins.
దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం `హేయ్‌..పిల్ల‌గాడ‌` త్వరలో విడుదలకానుంది. `ఓకే.. బంగారం` సినిమాతో దుల్క‌ర్, ఇటీవ‌ల విడుద‌లైన సెన్సేష‌న‌ల్ హిట్ అయిన `ఫిదా`తో భానుమ‌తిగా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసిన ప‌ల్ల‌వి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా `క‌లి`. మ‌ల‌యాళం, త‌మిళంలో మూవీ మంచి విజ‌యాన్ని సాధించిన ఈ సినిమాను తెలుగులో రిమేక్ చేసి విడుదలచేయనున్నారు. డి.వి. కృష్ణ‌స్వామి నిర్మాత‌. స‌మీర్ తాహిర్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. అక్టోబ‌ర్ నెల‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇదొక టిపిక‌ల్ ల‌వ్‌స్టోరీ అని, యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయని చిత్ర యూనిట్ చెబుతుంది. ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణ సూరెడ్డి గోపాలకృష్ణ(యు.ఎస్‌.ఎ), మాట‌లు భాషా శ్రీ, సాహిత్యం సురేంద్ర కృష్ణ‌, సంగీతం గోపీసుంద‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీ గిరీష్ గంగాధ‌ర‌న్‌ లు అందించారు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.