పీకే ని పక్కన పెడతారా?



Want create site? Find Free WordPress Themes and plugins.
వైకాపా అధినేత జగన్ పై ఇప్పుడు ఒత్తిడి గన్ ఎక్కు పెట్టి ఉంది. పార్టీ నేతలే ఆ గన్ ను ఎక్కు పెట్టడం విశేషం. ఆ పార్టీ ప్రధాన సలహాదారు ప్రశాంత్ కిషోర్ ను పీకేయమని చాలా మంది కోరడమే ఇందుకు కారణం. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో దారుణ ఓటమికి పీకే సలహాలు, సూచనలే కారణమని.. ఉత్తరాది రాజకీయాలు ఇక్కడ వారికి పనిచేయవని చెబుతున్నారు నేతలు. అందుకే అతన్ని తీసేయమని కోరుతున్నారట. ఇందుకు జగన్ ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. అతన్ని తీసుకువచ్చింది మనమే. మధ్యలో వద్దంటే రెండు రకాలుగా ఇబ్బంది పడతాం. పార్టీకి సంబంధించిన చాలా విషయాలు అతనికి తెలుసు. అందుకే అతన్ని రెండేళ్ల వరకు పక్కన పెట్టే ఆలోచన చేయడంలేదని చెప్పారట. 
                వాసిరెడ్డి పద్మ, భూమన కరుణాకర్ రెడ్డి, రోజా వంటి వారు పీకే పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వారే కాదు.. కొందరు సీనియర్ నేతలు, ఎంపీలు పీకే తీరును విమర్శించినట్లు తెలుస్తోంది. తెలిసి తెలియని సర్వేలు చేయించి నంద్యాలలో గెలుస్తామని చెప్పారని… రాబోయే ఎన్నికల్లో అదే తీరుతో ఉంటే ఇబ్బంది పడాల్సి వస్తోందని హెచ్చరించారట. ఎవరు ఎన్ని చెప్పినా అతన్ని భరించాల్సిందే. కాకపోతే ఇబ్బంది పెట్టకుండా కొన్ని విషయాలకే అతన్ని పరిమితం చేసే ఆలోచన చేద్దామని చెప్పారంటున్నారు. 
           పీకే కోరిక మేరకే నవరత్నాలను ప్రకటించారు జగన్. అలానే వైఎస్ కుటుంబం పేరుతో సభ్యత్వం చేర్పిస్తున్నారు. ఇలా వరుసగా కార్యక్రమాలు చేయిస్తు నేతల్లో ఉత్సాహం నింపే పనిచేయిస్తున్నారు. అలానే పాదయాత్రను వాయిదా వేసినా.. మంచి ముహూర్తం చూసుకుని మరీ ఈ పని చేసారంటున్నారు. పీకే సూచనతోనే బీజేపీ ఎంపీతో జగన్ టచ్ లో ఉన్నారంటున్నారు. పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ఉన్న పీకేను పీకేయడం అంత తేలిక కాదంటున్నారు. అందుకే జగన్ కు గట్టిగా చెప్పలేక అలాయని ఊరుకోలేక చాలా మంది తల్లడిల్లుతున్నారట. ఆయన బాధ భరించలేకనే రోజా లాంటి నేతలు.. శ్రీలంక, దుబాయ్, కువైట్ వంటి ప్రాంతాలకు వెళుతున్నారని తెలుస్తోంది.   
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*