దీపావళి తర్వాతే రాహుల్ పట్టాభిషేకం



Want create site? Find Free WordPress Themes and plugins.
       రేపు, మాపు అంటూ ఊరిస్తు వస్తున్న రాహుల్ గాంధీకి అధ్యక్ష పదవి దీపావళి తర్వాత వస్తుందట. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పదవిలో కొనసాగుతున్నా…అంతా రాహులే చూస్తున్నారు. ఇక మీదట అధికారికంగా చూస్తారు. అంతే తేడా. దీపావళి తర్వాత కాంగ్రెస్ లో కీలక మార్పులు ఉంటాయని సచిన్ పైలట్ అన్నారు. రాహుల్ యువతకు పెద్ద పీట వేస్తారని రాజేష్ పైలెట్ కుమారుడు సచిన్ పైలెట్ ద్వారా తెలుస్తోంది.  పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్‌ గాంధీ త్వరలోనే పార్టీని ముందుండి నడిపిస్తారన్నారు.
         పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు పైలట్‌. ప్రియాంక గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారా లేదా అనేది ఆమె ఇష్టంపై ఆధారపడి ఉందన్నారు. హస్తం పార్టీ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తోందన్న బీజేపీ వ్యాఖ్యలను ఖండించారు సచిన్ పైలట్‌. రాజకీయ వారసత్వం వచ్చినా… అంతిమంగా అతడి పనితీరు పార్టీని ముందుకు తీసుకుపోతుందన్న సంగతి మరువకూడదన్నారు సచిన్ పైలెట్. 
        కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ మధ్య దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపే పని చేస్తున్నారు. విపక్షంగా అధికార పార్టీ చేసే మంచి పనులను స్వాగతిస్తున్న సంగతి తెలిసిందే. స్వచ్ఛ భారత్ కార్యక్రమం మంచిదని ఇటీవల అమెరికాలో రాహుల్ అభిప్రాయపడ్డారు. అందుకే నేతగా ఎదిగిన రాహుల్ కు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ మేరకు సోనియాగాంధీ అధ్యక్షతన హస్తినలోని 10 జనపధ్ లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. 
         రాహుల్ కు పట్టాభిషేకం చేయాలనే ప్రతిపాదన వచ్చినా…అది పద్దతి ప్రకారమే జరగాలని సూచించారు సోనియా గాంధీ. ఈనెలలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. నిబంధల ప్రకారం పార్టీలోని 2వేల మంది ప్రతినిధులు, సీనియర్‌ నేతలు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఆ తర్వాత పార్టీ పగ్గాలు చేపడతారు రాహుల్. 1998 నుంచి సోనియాగాంధీనే పార్టీ అధినేత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పార్టీ కీలక బాధ్యతలు అప్పగించడం ఆలస్యం కావడం వల్ల వచ్చే నష్టం ఏమి లేదని ఈ లోపు అన్ని అంశాలను రాహుల్ అవగాహన చేసుకుంటారని  సోనియాగాంధీ చెబుతూ వచ్చారు. 
         మరోవైపు ఆ పదవి తీసుకునేందుకు రాహుల్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*