బీజేపీ నేతలతో జగన్ మంతనాలు



Want create site? Find Free WordPress Themes and plugins.
జగన్ పాదయాత్రకు బ్రేకుల పడతాయనే ప్రచారం వచ్చింది. అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. కానీ జగన్ పాదయాత్రను వాయిదా వేశాడని ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ మొదలైంది. మిగతా వారికి పాకింది. ఇప్పుడు తన పాదయాత్రకు కోర్టు కేసులు ఇబ్బందిగా మారడంతో జగన్ కిం కర్తవ్యంపై దృష్టి సారించాడు. వ్యూహంలో భాగంగా జగన్ బీజేపీ పెద్దలతో మాట్లాడారని తెలుస్తోంది. నంద్యాల ఎన్నికల ఫలితాలు వైకాపాకు అనుకూలంగా వచ్చి ఉంటే జగన్ ఇక ఢిల్లీకి చక్కర్లు కొట్టేవారంటారు. 
          అక్రమాస్తుల కేసులో జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాలి. పాదయాత్ర సమయంలో కోర్టుకు రావడం, వెళ్లడం జగన్ కు ఇబ్బందిగా మారే వీలుంది. అందుకే బీజేపీ పెద్దలతో మాట్లాడి క్లియరెన్స్ వచ్చేలా ఒప్పిస్తున్నాడనే ప్రచారం సాగుతోంది. అదే సమయంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీతో కలిసి సాగేందుకు సిద్ధమనే సంకేతాలను జగన్ ఇచ్చారంటున్నారు. గతంలోనే ప్రధాని మోడీతో ప్రత్యేకంగా మాట్లాడి వచ్చిన జగన్ ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వెనక్కు తగ్గాడు. మడమ తిప్పాడు. ఎంపీలతో రాజీనామా చేస్తామని చెప్పిన ఆయన ఆపని చేయించలేదు. ఫలితంగా జగన్ బీజేపీ చేతిలో చిక్కాడనే వాదన వచ్చింది. 
              ముఖ్యమంత్రి అయ్యేందుకు జగన్ తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. గతంలో చాలాసార్లు ఇలానే వచ్చినా అది నిజం కాదని తేలింది. లండన్ వెళ్లి వచ్చాక జగన్ ప్రజల ముందుకు రాలేదు. విజయదశమి నాడు జగన్ బీజేపీ పెద్దలతో మాట్లాడరని తెలుస్తోంది. కొందరు ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీకి చెందిన ముఖ్యులతో జగన్ మాట్లాడారంటున్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీ కుమారుడు ఇంటిలో రెండు గంటల పాటు ఈ చర్చలు జరిగాయని తెలుస్తోంది. పార్టీ విలీనమా, పొత్తా అన్నదే ఇంకా తేలలేదు. పొత్తుతో బీజేపికి వచ్చే లాభం ఏమి ఉండదు కాబట్టి విలీనం అనే పరిస్థితికి వచ్చారంటున్నారు. జగన్ వైపు నుంచి కేసులు మాఫీ చేయడం, పాదయాత్రకు ఇబ్బంది లేకుండా చూడటం, సి.ఎం కుర్చీ ఇవ్వడం ఒప్పందంలో భాగంగా ఉన్నాయట. జగన్ చెప్పిన మాటలను ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ నేతలు హస్తినకు చేరవేశారు. వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*