పాపం చిన్నారులు.. కూల్‌డ్రింక్‌ అనుకొని యాసిడ్‌ తాగేశారు



Want create site? Find Free WordPress Themes and plugins.

ఎంతో సంబరంగా పుట్టినరోజు వేడుకలు ఏర్పాటు చేశారు. స్నేహితులందరిని పిలిచారు. ఎంతో ఆనందంగా జరగాల్సిన ఆ వేడుకలు స్నేహితుల కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. కూల్‌డ్రింక్‌ అని భ్రమించి యాసిడ్‌ తాగేసి నిండా పదేళ్లు కూడా నిండని ఇద్దరు చిన్నారులు తనువు చాలించారు. బెంగళూరులోని ఓ మార్కెట్‌లో కిలారి రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శంకర్‌ బెంగళూరులో బంగారం వ్యాపారం చేస్తూ.. ఇక్కడే స్థిరపడ్డాడు. తన కుమారుడు సాయిల్‌ శంకర్‌ జన్మదిన వేడుకలను బ్రహ్మాండంగా నిర్వహించాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన తన మిత్రుడు సంజయ్‌సింగ్‌ని ఆహ్వానించాడు. కుమారుడు ఆర్యన్‌సింగ్‌తో కలిసి సంజయ్‌.. శంకర్‌ ఇంటికి వచ్చాడు. జన్మదిన వేడుకలలో భాగంగా కేక్‌ కట్‌ చేశారు. అనంతరం అందరూ భోజనాల ఏర్పాటులో ఉండగా, సాయిల్‌శంకర్‌, ఆర్యన్‌సింగ్‌లు ఇంట్లోని సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ను కూల్‌డ్రింక్‌గా భావించి సేవించారు. తీవ్ర అస్వస్థతకు గురయి, స్పృహ కోల్పోయారు. సమీపంలోని ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, విక్టోరియా ఆసుపత్రికి తరలిస్తుండగానే ఇద్దరూ చనిపోయారు. దీంతో ఆ కుటుంబాలు శోక సముద్రంలో మునిగిపోయాయి.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*