స్పైడర్ మూవీ సమీక్షWant create site? Find Free WordPress Themes and plugins.
రేటింగ్ : 2.5/5
నటీ నటులు : మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య తదితరులు…
దర్శకత్వం : మురుగదాస్
నిర్మాతలు : ఠాగూర్‌ మధు, ఎన్‌.వి.ప్రసాద్‌
మ్యూజిక్ : హరీష్ జయరాజ్
పరిచయ మాటలు…
బ్రహోత్సవం ప్లాప్ మహేష్ ను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఆ తర్వాత ఏడాది పైగానే గ్యాప్ తీసుకున్నారు. అందుకే తమిళంలో మంచి పేరున్న దర్శకుడు మురుగదాస్ ను తన సినిమాకు తీసుకున్నాడు. పదేళ్ళ తర్వాత మురుగదాస్ తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయటం అంచనాలను పెంచింది. మహేష్ ఒక్కడు, పోకిరి, శ్రీమంతుడు రేంజ్ లో స్పైడర్ ఉంటుందని నమ్మారు. టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు అదిరిపోయాయి. సరి కొత్త రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రిన్స్ మహేష్, మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన స్పైడర్ మూవీ ఎలా ఉందో చూద్దాం. 
కథ లోకి వెళితే…
శివ(మహేష్ బాబు) ఇంటలిజెన్స్ బ్యూరో లో కాల్ అనలిస్ట్. ఎవరికి ఎలాంటి ప్రమాదం వచ్చినా ఫోన్ కాల్ ద్వారా పసిగట్టి సమస్యలను పరిష్కరిస్తుంటాడు. అదే సమయంలో నగరంలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్యల వెనుక భైరవుడు(ఎస్ జె సూర్య) ఉన్నాడని తెలుసుకుంటాడు. అతనికి సాయం చేస్తున్న భైరవుడు తమ్ముడు భరత్ ని అంతమొందిస్తాడు. భైరవుడికే సవాల్ విసురుతాడు. పగతో రగిలిపోయిన భైరవ.. నగరంలో మరోసారి వరుస హత్యలకు సిద్దమవుతాడు. విధ్వంసాలు చేస్తాడు. ఫలితంగా వందలాది మంది జనం చనిపోతారు. మరి శివ వీటిని ఎలా ఎదుర్కుంటాడు. భైరవను ఎలా అంతమొందిస్తాడనేదే సినిమా కథ. 
నటనతీరు….
మహేష్ చాలా అద్భుతంగా ఈ పాత్ర చేశాడు. శివగా బాగా రాణించాడు. హీరో అనే తేడా లేకుండా కథ వరకే మహేష్ ను మురుగదాస్ చూపించాడు. పద్దతిగా ఉంటూనే అవసరమైనప్పుడు సంచనలం చేసే వ్యక్తిగా మహేష్ ను చూపించిన తీరు ఆకట్టుకుంటోంది. వయసు పెరిగే కొద్ది మహేష్ లో అందం పెరుగుతుందే తప్ప తరగడం లేదు. ఈ మూవీలో చాలా బాగా కనిపిస్తాడు మహేష్. పాటల్లో అంతగా డ్యాన్స్ చేయలేదు ప్రిన్స్. ఏదో సాదా సీదా స్టెప్పులు వేసినట్లు ఉంది. ఇక అందాల భామ పేరుకే పరిమితం. రకుల్ ప్రీత్ సింగ్ గురించి చెప్పడానికి పెద్దగా ఏమి లేదు. కథలో రకుల్ పాత్ర చాలా నామ మాత్రమే. పాటలకే పరిమితమైందా అమ్మడు. 
                హీరోతో సమానంగా ఛాలెంజింగ్ రోల్ చేశారు ఎస్ జె సూర్య. అతని నటన సినిమాకు మరో ప్రాణం అని చెప్పాలి. మహేష్, సూర్య లేకపోతే సినిమా చూడటం వేస్ట్ అనిపిస్తోంది. కొన్ని సార్లు మహేష్ ను డామినేట్ చేసేలా సీన్స్ ఉంటాయి. ఇక భరత్ విలన్ తమ్ముడిగా చేసిన పాత్ర అంతగా ఆకట్టుకోదు. పాత్ర కోసమే భరత్ ను తీసుకున్నారు తప్ప మరొకటి కాదు. మిగతా వారి గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది అంతగా ఉండదు. మొత్తంగా శివ అండ్ భైరవ పాత్రల మధ్య పోటీ అద్భుతమనే చెప్పాలి. 
సాంకేతికాంశాలు…
దర్శకుడు మురుగదాస్ తమిళ వాసనలు ఈ సినిమాలో కనపడ్డాయి. విలన్ భైరవ పాత్రకు సెపరేట్ గా ఫ్లాష్ బ్యాక్ ఉండటం, అది తెలుగు నేటివిటీకి దూరంగా ఉంది. తమిళ నాటి ఏడుపులు, అరుపులు ఉంటాయి. విలన్ పాత్రకు ఇంత ప్రాధాన్యత ఇచ్చిన దర్శకుడు హీరోను అంత కన్నా బలంగా తీర్చిదిద్దాలి. కనీసం క్లైమాక్స్ కు ముందైనా ఆ తేడా చూపాలనిపిస్తోంది. మహేష్ ని తెలివైన పాత్రగా తీర్చిదిద్దడం మంచిదే. విలన్ ఎవరి మద్దతు లేకుండా అరాచకం చేయటం ఆశ్చర్యమనిపిస్తోంది. వరుస హత్యలను చేసుకుంటూ పోతున్న విలన్ ను హీరో తెలివిగా పట్టుకుని మట్టుబెట్టడం అనేదే మొత్తం కథ. కొన్ని సార్లు దానికి అనుబంధ కథలు వచ్చే చేరతాయి. టెర్రరిస్ట్ లను చంపే సీన్ కోసం ఇంట్లో టీవీ సీరియల్స్ చూసే ఆడవాళ్ళ సాయం తీసుకుంటాడు హీరో. బండరాయి విధ్వంసం, హాస్పిటల్ లో బాంబు బ్లాస్ట్ ఇవన్నీ పర్వాలేదు. మురుగదాస్ పర్వాలేదనిపించాడు గానీ అంత అద్భుతమైతే కాదు.  
                  హీరో తన తల్లిని కాపాడుకునే సీన్, విలన్ తమ్ముడిని ఫ్లై ఓవర్ మీద చంపే సీన్ లు బాగున్నా… సినిమాలో ఏదో లోపించింది అనిపిస్తోంది. సిసిలియా పాటబాగుంది. పర్వాలేదు. హారిస్ జైరాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు మరింత ఆకట్టుకునేలా ఏమి లేదు. సంతోష్ శివన్ కెమెరా చాలా బాగుంది. సినిమాను ఐ ఫీస్ట్ గా చూపించడంలో శివన్ ది కీలక పాత్ర అని చెప్పాలి. నిర్మాతలు ఠాగూర్ మధు, ప్రసాద్ లు ఖర్చుకు వెనుకాడలేదని సినిమా చూస్తే అర్థమవుతోంది. 
ప్లస్ పాయింట్స్…
+ మహేష్, ఎస్ జె సూర్య నటన              
+ సంతోష్ శివన్ కెమెరా
+ ఇంటర్వెల్ ఎపిసోడ్
+ యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్…
– తమిళ వాసన 
– పాటలు
– హీరో హీరోయిన్ లవ్ ట్రాక్
– సెకండ్ హాఫ్ సాగదీత 
మొత్తం….
మురుగదాస్ నుంచి ఆశించిన స్థాయిలో స్పైడర్ లేదు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*