రాం గోపాల్ రెడ్డిగా మారిన వర్మ



Want create site? Find Free WordPress Themes and plugins.
       సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఏంచేసినా వార్తల్లోకి ఎక్కుతోంది. అందరినీ ఆకట్టుకునేందుకు చాలా పనులు చేస్తుంటాడు. నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. రాం గోపాల్ వర్మ ఇప్పుడు రామ్‌గోపాల్‌ రెడ్డిగా మారారట. విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం పేరును మార్చి రాం గోపాల్ రెడ్డిగా మార్చాడు వర్మ. అర్జున్ రెడ్డి సినిమాను అద్భుత చిత్రంగా కొనియాడారు వర్మ. ఆ సినిమా విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రూ.4 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం రూ.40 కోట్లకు పైగానే వసూళ్లు చేసింది. అర్జున్ రెడ్డి పోస్టర్ ను వర్మ మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఇందులో విజయ్‌ దేవరకొండ ముఖాన్ని మార్ఫింగ్‌ చేసి ఆ స్థానంలో వర్మ చిత్రాన్ని పెట్టారు. ఈ పోస్టర్‌కు ‘రామ్‌గోపాల్‌ రెడ్డి’ అనే క్యాప్షన్‌ రాశారు. 
        వర్మ పోస్ట్‌ను చూసిన విజయ్‌ దేవరకొండ సరదాగా కామెంట్ పెట్టారు. ‘ఆర్జీఆర్‌ను పరిచయం చేస్తున్నాం. రామ్‌గోపాల్‌ రెడ్డికి హలో చెప్పండి.’ క్యాప్షన్‌ రాశారు. అంతే ఇక కామెంట్ల వరద పారుతోంది. వర్మ రెడ్డి అని ఒకరు. రామ్ గోపాల్ రెడ్డికి స్వాగతం అని మరొకరు.ఇలా ఎవరికి వారే కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 
      ఎన్టీఆర్‌ జీవితాధారంగా వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ అనే సినిమాను ప్రముఖ నటుడు జె.డి చక్రవర్తి నిర్మాతగా ఉంటున్నారనే ప్రచారం వచ్చింది. దీని పై వర్మ ఫేస్‌బుక్‌ ద్వారా వివరణ ఇచ్చారు. జేడీకి ఈ చిత్రానికి సంబంధం లేదని చెప్పారు వర్మ. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*