10 పేరుతో తెలుగులో సమంత సినిమా



Want create site? Find Free WordPress Themes and plugins.
          పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచన చేస్తోంది అక్కినేని కోడలు సమంత. పెళ్లికి ఏ గౌన్లు వేసుకోవాలి. డిజైన్లు ఎలా ఉండాలంటూ సోషల్ మీడియాలో ఫోటోలు అప్ లోడ్ చేసి మరీ ఊరిస్తోంది. అభిమానులను ఉత్సాహపరుస్తోంది. ఈలోపే తాను ఒప్పుకున్న సినిమాలన్నింటినీ పూర్తి చేస్తోంది. కానీ గతంలో తమిళంలో సమంత నటించిన సినిమాలు ఇప్పుడు తెలుగులోకి డబ్ అవుతున్నాయి. అందులో ఒకటి విక్రమ్‌, సమంత జంటగా నటించిన మూవీ ‘10 ఎండ్రత్తుకుల్ల’. విజయ్‌ మిల్టన్‌ దర్శకుడు. ఎ.ఆర్‌. మురుగదాస్‌ ఈ సినిమా నిర్మించారు. 2015లో తమిళ్‌లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. శ్రీ సుబ్రమణ్యేశ్వర సినీ క్రియేషన్స్‌ పతాకంపై తెలుగులోకి వస్తోందీ సినిమా. ‘10’ అనే టైటిల్‌ పెట్టిన నిర్మాతలు…అక్టోబర్ లోనే విడుదల చేయనున్నారు. అనువాద కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పుడీ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. 10 సినిమా ట్రైలర్‌, ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. సమంతతో పాటు..ఛార్మి ప్రత్యేక పాత్రలో ఈ మూవీలో నటించారు. 
 
 
 
 
 
 
 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*