పవన్ కల్యాణ్ పోటీ చేసే సీట్లు ఏవంటే 



Want create site? Find Free WordPress Themes and plugins.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రానున్న ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తారట. అనంతపురం జిల్లాలోని గుత్తి, కదిరి లేక అనంతపురం అర్బన్ లో ఓ చోట, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మరొకటి. గతంలో ప్రజారాజ్య పార్టీ అధినేతగా మెగాస్టార్ చిరంజీవి పాలకొల్లు, తిరుపతిలో పోటీ చేసారు. పాలకొల్లులో పరాజయం పాలైనా తిరుపతిలో విజయభేరి మోగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవర్ స్టార్ అన్నను ఆదర్శంగా తీసుకుంటున్నట్లున్నాడు. రెండు చోట్ల బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే తాను పోటీ చేసే ప్రాంతాలపై సర్వే చేయించారు జనసేన అధినేత. స్థానిక నేతలు ఎవరు. సామాజిక వర్గాలు, కులాలు, వర్గాలు వంటి విషయాల లెక్కలను తీసుకున్నారు. మూడు సార్లు చేసిన సర్వేల్లో పవన్ గెలుస్తారనే వచ్చిందట. 
                       పాలకొల్లులో పవన్ గెలుపుకు ఎలాంటి ఢోకా లేదంటున్నారు. అయితే పోయిన సారి ఎన్నికల్లో టీడీపీ 15 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లను గెలుచుకుంది. అయినా పవన్ అక్కడ పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. తనకు తానుగా అనంతపురం జిల్లాలో పోటీ చేస్తానని గతంలోనే పవన్ ప్రకటించారు. అందుకే బరిలోకి దిగేందుకు పావులు కదుపుతున్నారు. టీడీపీకి కంచుకోట లాంటి ప్రాంతం అనంతపురం జిల్లా. అయినా పవన్ గెలుపుకు ఇబ్బంది ఉండదని సర్వేలు చెప్పాయట. టీడీపీతో పొత్తు ఉంటుందా ఉండదా అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు మారే అవకాశముంది. టీడీపీ, జనసేన కలిస్తే అటువైపే జనం మొగ్గు చూపుతారని మెజార్టీ సర్వేలు చెబుతున్నాయి.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*