జగన్ పాదయాత్ర వాయిదా



Want create site? Find Free WordPress Themes and plugins.
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది. అక్టోబర్27కు బదులు నవంబర్ రెండు నుంచి ప్రారంభించవచ్చని సమాచారం. ఆరు నెలలపాటు మూడువేల కిలోమీటర్లకు పైగా జరిగే పాదయాత్ర కోసం మంచి ముహుర్తం కావాలని వేద పండితులను అడిగారట జగన్. అక్టోబర్ 27న పాదయాత్ర ప్రారంభించడం మంచిది కాదని చెప్పారట. ఫలితంగా ఆ తేదిని వాయిదా వేసి మరొక తేదిని సూచించారని తెలుస్తోంది. అంతే కాదు.. ప్రతి శుక్రవారం జగన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. తనకు కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టులో జగన్ అనుమతి కోరనున్నారు. త్వరలోనే ఈ దరఖాస్తును కోర్టు ముందుకు ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. 
         రాజకీయ కారణాలతో కోర్టుకు హాజరు కాకుండా ఉండటం మంచిది కాదని గతంలోనే జగన్ ను కోర్టు ఆదేశించింది. గుంటూరు ప్లీనరీ జరిగే సమయంలో జగన్ ను కోర్టు హెచ్చరించింది. మరోసారి సభలు, సమావేశాలు, యాత్రలు అని కోర్టుకు చెప్పవద్దని స్పష్టం చేసింది. మరి ఇలాంటి సమయంలో జగన్ పాదయాత్రకు కోర్టు అనుమతిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. కేసీఆర్, చంద్రబాబులకే కాదు.. జగన్ కు వాస్తు, జ్యోతిష్యం, ముహూర్తాల బలం చూసే అలవాటు వచ్చిందంటున్నారు మరోవైపు జనాలు.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*